हिन्दी | Epaper
బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

షేక్ హసీనా వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ నిరసన

Sukanya
షేక్ హసీనా వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ నిరసన

బహిష్కరణలో ఉన్న మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ గురువారం భారతదేశం యొక్క తాత్కాలిక హైకమిషనర్‌కు నిరసన తెలిపింది. హసీనా చేసిన వ్యాఖ్యలు “తప్పుడు మరియు కల్పితమైనవి” అని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హసీనా ఇటీవల తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించగా, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమె వ్యాఖ్యలను దేశానికి వ్యతిరేకమైన “శత్రు చర్య”గా పరిగణించింది. దీనిపై ఢాకా, న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వాన్ని తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. బంగ్లాదేశ్ ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఈ తరహా ప్రకటనలు ఆరోగ్యకరమైన ద్వైపాక్షిక సంబంధాలకు అనుకూలంగా ఉండవని తెలిపింది.

బుధవారం రాత్రి హసీనా ప్రసంగించిన అనంతరం, బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరసనలు ఉధృతమయ్యాయి. ఆమె తన ప్రసంగంలో ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను ప్రతిఘటనకు పిలుపునిచ్చారు. 77 ఏళ్ల హసీనా గత సంవత్సరం ఆగస్టు 5న, బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన భారీ నిరసనల కారణంగా పదవీచ్యుతురై, భారతదేశానికి వోచారు. హసీనా ప్రసంగం తర్వాత, డాకాలో నిరసనకారులు ఆమె తండ్రి మరియు బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసాన్ని ధ్వంసం చేసి నిప్పంటించారు. అలాగే, అవామీ లీగ్ నాయకులను లక్ష్యంగా చేసుకుని దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసకార్యకలాపాలు చోటుచేసుకున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870