हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల ప్రారంభం వాయిదా

sumalatha chinthakayala
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల ప్రారంభం వాయిదా

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమై వాయిదా పడ్డాయి. 11 గంటలకు సభ ప్రారంభం కాగానే శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. మంత్రివర్గ భేటీ దృష్ట్యా సమావేశాలను వాయిదా వేయాలని స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను కోరారు. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

image

స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల ఖరారుపై కీలకంగా మారిన సామాజిక ఆర్థిక సర్వే నివేదికను ప్రణాళికా శాఖ ఆదివారం బీసీ మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసిన విషయం తెలిసిందే. ఈ నివేదికను సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ హాలులో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో సబ్‌కమిటీ సమర్పించనుంది. ఎస్సీ వర్గీకరణపై నియమించిన జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ ఏకసభ్య కమిషన్‌ కూడా తమ నివేదికను ఉపసంఘానికి సోమవారం అందించింది. ఈ రెండు నివేదికలపై క్యాబినెట్‌ చర్చించి ఆమోదించనుంది. అనంతరం వీటిని అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెట్టి చర్చించనున్నారు.

కాగా, కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికను సభలో చర్చకు పెట్టనుంది ప్రభుత్వం. అంతకు ముందు సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశమైంది. ఈ భేటీలో నివేదికకు ఆమోదం లభించినట్లు సమాచారం. అయితే ఆ భేటీ కొనసాగుతుండడంతో.. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు సభను వాయిదా వేయాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను కోరారు. దీంతో మధ్యాహ్నాం 2గం​. దాకా సమావేశాలు వాయిదా పడ్డాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870