అమెరికా ఎన్నికల వ్యవస్థలో మార్పులకు ట్రంప్ శ్రీకారం

అమెరికాలో ఇన్ కమ్ ట్యాక్స్ రద్దుకు ట్రంప్ నిర్ణయం?

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక అమెరికా ఫస్ట్ నినాదంతో పాలిస్తానని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మరో సంచలనానికి తెరదీశారు. త్వరలో దేశంలో ఆదాయపు పన్ను రద్దు చేయాలని ట్రంప్ నిర్ణయించారు.ఈ మేరకు సంకేతాలు ఇచ్చేశారు. దీని స్ధానంలో ఏ చేయబోతున్నారో కూడా అమెరికన్లకు చెప్పేశారు. దీంతో ట్రంప్ నిర్ణయాలు అమెరికన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అమెరికా పౌరులకు ప్రస్తుతం విధిస్తున్న ఆదాయపు పన్నును తొలగించబోతున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చేశారు. వ్యక్తులు, కుటుంబాల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. తమను ధనవంతులుగా చేసిన అమెరికాను పునరుద్ధరించే దిశగా ఈ చర్య తీసుకోబోతున్నట్లు వెల్లడించారు.

Advertisements

ప్రస్తుతం అమెరికా ఆర్ధిక వ్యవస్థకు అత్యంత కీలకమైన ఆదాయపు పన్నును పూర్తిగా రద్దు చేసి, దిగుమతి సుంకాలను పెంచడం ద్వారా ఈ లోటు పూడ్చుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. విదేశాలను సుసంపన్నం చేయడానికి మన పౌరులపై పన్ను విధించే బదులు, మన పౌరులను సుసంపన్నం చేయడానికి విదేశీ దేశాలపై పన్ను విధించాలని అమెరికా అధ్యక్షుడు హౌస్ రిపబ్లికన్ సభ్యుల కాన్ఫరెన్స్‌లో తన పన్ను సంస్కరణ ప్రణాళికలను బయటపెట్టారు. అలాగే అమెరికాలో బహుముఖ పన్నుల తగ్గింపుల కోసం ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రతిపాదిత తగ్గింపుల నుండి రాబడి లోటును భర్తీ చేయడానికి దిగుమతి సుంకాలను వాడుకోవాలని భావిస్తున్నారు. అలాగే దిగుమతి సుంకాల నిర్వహణను పర్యవేక్షించడానికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

Related Posts
నమీబియా తొలి మహిళా అధ్యక్షురాలిగా నెటుంబో నాండి-న్డైత్వా
namibia president

నమీబియా యొక్క శాసనసమితి సభ్యులుగా ఉండే SWAPO పార్టీకి చెందిన నేత నెటుంబో నాండి-న్డైత్వా నమీబియా కొత్త రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆమె ఈ దేశానికి తొలి మహిళా Read more

Naresh Goyal: ఆకాశానికి ఎదిగి.. చివరికి పాతాళములోకి జారిన నరేష్ గోయల్
ఆకాశానికి ఎదిగి.. చివరికి పాతాళములోకి జారిన నరేష్ గోయల్

ఒకప్పుడు ఆకాశాన్ని ఏలిన జెట్ ఎయిర్‌వేస్ ఇప్పుడు మూతపడింది. నరేష్ గోయల్ తన జీవితంలోని చివరి దశలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాడు. కాగా ప్రస్తుతం అతను బెయిల్‌పై Read more

భారత్‌పై ట్రంప్‌ ఆగ్రహం: మద్యం పన్నులపై విమర్శలు
: బైడెన్ పాలనలో పెరిగిన వాణిజ్య లోటు: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్‌ విధిస్తున్న అధిక పన్నులను తీవ్రంగా విమర్శించారు. అమెరికా నుండి దిగుమతి చేసుకునే మద్యం, ముఖ్యంగా బోర్బన్ విస్కీపై భారత్‌ 150% Read more

ట్విట్టర్ నుండి బ్లూస్కైకి మారుతున్న వినియోగదారులు
images 1

డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత, మిలియన్ల మంది X ( ట్విట్టర్) వేదికను వదిలి, జాక్ డోర్సీ ప్రారంభించిన బ్లూస్కై (Bluesky) కి చేరిపోతున్నారు. ఈ మార్పు, Read more

×