ss rajamouli on vijayendra prasads

విజయేంద్ర ప్రసాద్ భారీ సినిమా .రాజమౌళి దర్శకత్వం చేస్తారా లేదా?

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా ఎస్ ఎస్ ఎంబీ 29 (వర్కింగ్ టైటిల్) పనుల్లో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి చిత్రానికి ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తున్నారు. తాజాగా విజయేంద్ర ప్రసాద్ తన తదుపరి సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం, రాజమౌళి మహేష్ బాబు నటిస్తున్న ఎస్ ఎస్ ఎంబీ 29 సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇటీవలే అధికారికంగా ప్రారంభించారు. మహేష్ బాబుతో పాటు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. రాజమౌళి ఈ సినిమా ప్రారంభంపై ఓ వీడియోను అప్‌లోడ్ చేసి, సింహాన్ని బోనులో పెట్టి పాస్‌పోర్ట్ లాక్కున్నట్లు చెప్పి, షూటింగ్ ప్రారంభమైందని సంకేతం ఇచ్చారు.

Advertisements
vijayendra prasad

ఇక, రాజమౌళి తన తదుపరి చిత్రంపై ప్రస్తుతం తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి దాదాపు ప్రతి సినిమాకు ఆయన తండ్రే కథ రాస్తున్నారు. స్టూడెంట్ నెం.1 మినహా, ఆయన దర్శకత్వంలో వచ్చిన అన్ని చిత్రాలకు విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్, తన తదుపరి సినిమా గురించి చెప్పారు. ఆయన సీతపై ఓ ప్రత్యేక కథ రాశారు. ఇందులో రామాయణాన్ని సీత కోణంలో చూపించాలని అనుకున్నారు. ఈ సినిమాను కోట్ల రూపాయల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించాలని ఆయన ప్లాన్ చేశారని చెప్పారు.అయితే, ఈ సినిమాకు రాజమౌళి స్వయంగా దర్శకత్వం వహిస్తాడా లేక మరెవరైనా వహిస్తారో అన్నది ఇంకా స్పష్టంగా చెప్పలేదు. రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తే, కనీసం నాలుగేళ్లు పడే అవకాశం ఉందని చెప్పారు.

Related Posts
Pelli kani Prasad:’పెళ్లి కాని ప్రసాద్’ నటనతో ఆకట్టుకున్నసప్తగిరి
Pelli kani Prasad:'పెళ్లి కాని ప్రసాద్' నటనతో ఆకట్టుకున్నసప్తగిరి

పెళ్ళి కాని ప్రసాద్ సినిమా సమీక్ష సప్తగిరి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన కామెడీ టైమింగ్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. ఆయన ఓ కమెడియన్‌గా Read more

Samantha : నాగ చైతన్య విషయంలో నేను అలా ప్రవర్తించి ఉండాల్సింది..తప్పు చేశా అంటూ సమంత షాకింగ్ కామెంట్స్
samantha

సమంత మరియు నాగ చైతన్య వీరిమధ్య విడాకులు గురించి తరచూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉంటాయి వీరిద్దరి విడాకులకు కారణం ఏమిటి అన్నది ఎంతో మందికి Read more

సైన్స్ ఫిక్షన్ థ్రిల్ల‌ర్ మూవీ – మూడో వ‌ర‌ల్డ్ వార్ వ‌స్తే
kadaisi ulaga por 1726063610

ఇటీవల, హిప్ హాప్ తమిళ్ అన్న పేరు ఇప్పుడు తమిళ, తెలుగు మరియు బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా తెలిసినది. ఈయన, ధృవ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరుపెట్టుకున్న హిప్ Read more

Akshay Kumar: కేసరి 2 మూవీ లోని మొదటి 10 నిమిషాలు చాలా ముఖ్యమైనవి:అక్ష‌య్ కుమార్
Akshay Kumar: కేసరి 2 మూవీ లోని మొదటి 10 నిమిషాలు చాలా ముఖ్యమైనవి:అక్ష‌య్ కుమార్

నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘కేస‌రి చాప్టర్ 2’. ఈ సినిమా జలియన్ వాలాబాగ్ ఘటన ఆధారంగా రూపొందుతోంది. ‘అన్‌టోల్డ్‌ స్టోరీ Read more

×