हिन्दी | Epaper

బాలకృష్ణను సన్మానించిన కిషన్ రెడ్డి

Sudheer
బాలకృష్ణను సన్మానించిన కిషన్ రెడ్డి

ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నేత నందమూరి బాలకృష్ణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన బాలకృష్ణను హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి స్వయంగా వెళ్లి సన్మానించారు. శాలువాతో సత్కరించిన కిషన్ రెడ్డి, పుష్పగుచ్ఛాన్ని అందించి అభినందనలు తెలిపారు. నందమూరి బాలకృష్ణ సినీ రంగంలోనే కాదు, రాజకీయ రంగంలోనూ తనదైన ముద్రవేశారు. సినిమాల ద్వారా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న ఆయన, ఎన్టీఆర్‌ వారసుడిగా సేవలందిస్తూ ప్రజల మన్ననలను అందుకున్నారు. ఈ సేవలకు గుర్తింపుగా పద్మభూషణ్ అవార్డు లభించడంతో ఆయన అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

balakrishna padama

కిషన్ రెడ్డి మాట్లాడుతూ “బాలకృష్ణ గారు ఒక వర్సటైల్ నటుడిగా తన ప్రతిభతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన సేవలు ఎంతోమందికి ప్రేరణ. ఈ అవార్డు ద్వారా ఆయన ప్రతిభకు న్యాయం జరిగినట్టు అనిపిస్తోంది,” అని చెప్పారు. బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతూ, మరిన్ని ఘనతలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్శన సందర్భంగా కిషన్ రెడ్డి, బాలకృష్ణ మధ్య కాసేపు స్నేహపూర్వకంగా చర్చలు జరిగాయి. సాంస్కృతిక, రాజకీయ అంశాలపై ఇరువురూ మాట్లాడారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కూడా సమావేశమయ్యారు. బాలకృష్ణను కేంద్రమంత్రివర్గంలో నుంచి వచ్చిన అభినందనలు మరింత ప్రత్యేకంగా నిలిచాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్.. బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్.. బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్

శ్రీలీలకు బంపర్ ఆఫర్

శ్రీలీలకు బంపర్ ఆఫర్

విష్వక్సేన్ ‘కల్ట్’ టీజర్ వైరల్, వయొలెన్స్‌తో షాక్ ఇచ్చింది

విష్వక్సేన్ ‘కల్ట్’ టీజర్ వైరల్, వయొలెన్స్‌తో షాక్ ఇచ్చింది

స్టేజీపై వరలక్ష్మీ శరత్ కుమార్ కన్నీళ్లు

స్టేజీపై వరలక్ష్మీ శరత్ కుమార్ కన్నీళ్లు

డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ డైలాగ్స్ పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ డైలాగ్స్ పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

అల్లు అర్జున్ ‘సంధ్య థియేటర్ తొక్కిసలాట’ కేసులో కీలక పరిమాణం

అల్లు అర్జున్ ‘సంధ్య థియేటర్ తొక్కిసలాట’ కేసులో కీలక పరిమాణం

యష్ టాక్సిక్ టీజర్ విడుదల
1:52

యష్ టాక్సిక్ టీజర్ విడుదల

జైలు నుండి బయటకు వచ్చాక ఐ బొమ్మ రవి నుండి వచ్చిన మాట అదే !!

జైలు నుండి బయటకు వచ్చాక ఐ బొమ్మ రవి నుండి వచ్చిన మాట అదే !!

స్పెషల్ జ్యూరీ ఛైర్మన్ గా తమ్మారెడ్డి నియామకం

స్పెషల్ జ్యూరీ ఛైర్మన్ గా తమ్మారెడ్డి నియామకం

విజయ్-రష్మిక పెళ్లి.. హోటల్ ప్రత్యేకతలు

విజయ్-రష్మిక పెళ్లి.. హోటల్ ప్రత్యేకతలు

లోకా చాప్టర్ 2 అప్‌డేట్, మళ్లీ కళ్యాణి ఎంట్రీ.. షూటింగ్ ఎప్పుడంటే?

లోకా చాప్టర్ 2 అప్‌డేట్, మళ్లీ కళ్యాణి ఎంట్రీ.. షూటింగ్ ఎప్పుడంటే?

‘కల్ట్’ టీజర్ రాబోతుంది, విశ్వక్ సేన్ కొత్త ప్రయోగం!

‘కల్ట్’ టీజర్ రాబోతుంది, విశ్వక్ సేన్ కొత్త ప్రయోగం!

📢 For Advertisement Booking: 98481 12870