us and denmark

డెన్మార్క్ ప్రధానికి ట్రంప్ తీవ్ర బెదిరింపులు!

అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్.. గతంలోలాగే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తాను చేయాలనుకున్న పనులను అమలు చేస్తూనే.. కోరుకున్నవన్నీ దక్కించుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి సారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే గ్రీన్‌లాండ్ కొనుగోలు చేయాలనుకున్న ట్రంప్.. ఈసారి పదవిలోకి రాకముందు నుంచే కచ్చితంగా ఈసారి గ్రీన్‌లాండ్‌ను దక్కించుకుంటానని చెప్పారు. ఆ కలను నెరవేర్చుకోవడానికి తాజాగా డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్‌కు ఫోన్ చేశారు. ముఖ్యంగా వారి అధీనంలో ఉన్న గ్రీన్‌లాండ్‌ను అమ్మాలంటూ ప్రతిపాదించారు.

Advertisements

కానీ డెన్మార్క్ ప్రధాని మాత్రం అది కుదరదని చెప్పారట. పెద్ద ఎత్తున ఖనిజాలు లభించే గ్రీన్‌లాండ్‌ను అమ్మాలనే ఉద్దేశమే తమకు లేదని వివరించగా.. ట్రంప్ చాలా సీరియస్ అయినట్లు సమాచారం. ఈక్రమంలోనే మెటె ఫ్రెడెరిక్సన్‌తో చాలా దూకుడుగా మాట్లాడరట. తన కలను నెరువేర్చుకునేందుకు బెదిరింపులకు కూడా పాల్పడ్డారట. ఆ మాటలు విన్న ట్రంప్ వద్దనున్న అధికారులు వాటికి ఆశ్చర్యపోయారని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి.
మొత్తం 45 నిమిషాల పాటు సాగిన ఈ ఫోన్ కాల్‌లో.. ట్రంప్ డెన్మార్క్ మీద విధించబోయే సుంకాల గురించి కూడా చెప్పినట్లు తెలుస్తోంది. కానీ డెన్మార్క్ ప్రధాని మాత్రం వాటేమిటికీ భయపడకుండా గ్రీన్‌లాండ్‌ను అస్సలే అమ్మబోమని వివరించినట్లు సమాచారం.

Related Posts
ఆపిల్ కొత్త AI ప్లాట్‌ఫారమ్‌తో వాల్ టాబ్లెట్ మార్చి లో లాంచ్
apple success story

ప్రపంచ ప్రసిద్ధ టెక్ కంపెనీ ఆపిల్, వచ్చే మార్చి నెలలో కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాల్ టాబ్లెట్‌ను లాంచ్ చేయాలని భావిస్తోంది. ఈ కొత్త పరికరం Read more

Jeremy Story : అమెరికా న్యూమెక్సికో లో మరోసారి కాల్పుల కలకలం : ముగ్గురు మృతి
Jeremy Story : అమెరికా న్యూమెక్సికో లో మరోసారి కాల్పుల కలకలం : ముగ్గురు మృతి

Jeremy Story : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం : ముగ్గురు మృతి అమెరికాలో మరోసారి కాల్పుల భయం నెలకొంది.న్యూమెక్సికో రాష్ట్రంలోని లాస్ క్రూసెస్ నగరంలో జరిగిన Read more

లాస్ ఏంజెలిస్ లో మళ్లీ మంటలు.. హెచ్చరికలు
los angeles wildfires

అమెరికాలోని లాస్ ఏంజెలిస్ నగరానికి మరోసారి అగ్నిమాపక ముప్పు ఏర్పడింది. తూర్పు ప్రాంతంలోని శాంటా అనా నది వద్ద కొత్తగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం Read more

Rahul gandhi: రాహుల్‌ గాంధీ పౌరసత్వంపై కేంద్రానికి గడువు ఇచ్చిన అలహాబాద్‌ హైకోర్టు
రాహుల్‌ గాంధీ పౌరసత్వంపై కేంద్రానికి గడువు ఇచ్చిన అలహాబాద్‌ హైకోర్టు

కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పౌరసత్వం అంశంలో కేంద్ర ప్రభుత్వానికి అలహాబాద్‌ హైకోర్టు గడువు నిర్దేశించింది. నాలుగు వారాల్లో పౌరసత్వం అంశం తేల్చాలని Read more

×