ktr digest the growth posters hyderabad

ఈనోకు ఫ్రీ పబ్లిసిటీ – హైదరాబాద్ అంతా హోర్డింగులు

సినిమా హాళ్లలోనో లేకపోతే టీవీల్లోనే ఈనో ప్రకటన వస్తుంది. భోజనం చేసిన తర్వాత వచ్చే కడుపులో మంటని ఈనో తగ్గిస్తుందని ఆ ప్రకటనల సారాంశం. ఆ ప్రకటలను ఈనో తయారు చేసే కంపెనీ ఇస్తుంది. అందు కోసం చాలా ఖర్చు పెట్టాలి. కానీ ఇప్పుడు ENO కంపెనీ ఎలాంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా భారీగా ప్రచారం పొందుతోంది. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా పోస్టర్లు, హోర్డింగులు రాత్రికి రాత్రి వెలిశాయి. వీటిని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది.

తెలంగాణ రాజకీయాల వల్ల కడుపులో మంటను తగ్గించే ఈనో ప్యాకెట్లకు ప్రీ పబ్లిసిటీ వస్తోంది. ఏకంగా హోర్డింగులు పెట్టేశారు. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి చేసుకున్న ఎంవోయూలు అన్నీ ఫేక్ అనిబీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో చేసిన వాటి కన్నా ఎక్కువ ఎంవోయూలు చేసుకున్నామని కడుపు మంటతో ఈ విమర్శలు చేస్తున్నారని ఈనో వాడాలంటూ కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. ప్రెస్మీట్లలో ఈనో ప్యాకేట్లు చూపించారు. తర్వాత ఈనో ప్యాకెట్లను బీఆర్ఎస్ నేతలకు పంపుతున్నట్లుగా ప్రకటనలు చేశారు. అంత వరకూ బాగానే ఉంది.. కానీ తెల్లారేసరికి హోర్డింగులు పెట్టేశారు.ఇందులో ఈనోను చాలా పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి నిజంగానే ఈనోకు ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. ఇలాంటి పోస్టర్లు, హోర్డింగ్ వల్ల ఈనోకు ప్రచారం వస్తుంది. కానీ ఇలాంటి ప్రచారాన్ని ఆ కంపెనీ కోరుకుంటుందా లేదా అన్నది తెలియదు. ఇష్టం లేకపోతే ఆ కంపెనీ కాంగ్రెస్ మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. తమ బ్రాండ్ ను రాజకీయంగా ఉపయోగించుుకుంటున్నారని విమర్శించవచ్చు.

Related Posts
Pumphouse: రేపు దేవన్నపేట పంప్‌హౌస్‌ ప్రారంభం
Devannapet pump house to open tomorrow

ఒక మోటార్‌ను ప్రారంభించనున్న మంత్రులు ఉత్తమ్, పొంగులేటి Pumphouse : దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా దేవన్నపేటలో కట్టిన పంప్‌హౌస్‌లో ఒక మోటార్‌ను రేపు (19వ తేదీన) నీటిపారుదల Read more

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఈరోజు సుప్రీంకోర్టులో తెలంగాణలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అసంబద్ధత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారించబడింది. ఈ పిటిషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు Read more

బండి సంజయ్, రేవంత్ డ్రామా ఆడుతున్నారు – కేటీఆర్
sanjay ktr

గ్రూప్-1 అభ్యర్థులను ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడం దారుణమని కేటీఆర్ అన్నారు. 'గ్రూప్-1 అభ్యర్థులను ప్రభుత్వం పశువుల్లా చూస్తోంది. సుప్రీంకోర్టు నిర్ణయం వరకు ఆగాల్సింది. బండి సంజయ్, రేవంత్ Read more

Kamareddy: పండుగ రోజు విషాదం.. చెరువులో పడి ఒకే ఇంట్లో నలుగురు మృతి
Kamareddy: పండుగ రోజు విషాదం.. చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

ఉగాది పండుగ రోజు ఆనందంగా గడపాల్సిన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఆనందంగా Read more