టర్ హైదరాబాద్ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడే విధంగా విస్తరించాలని భావిస్తోంది. ఇందు కోసం కొత్త ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అందులో భాగంగా ఏకంగా ఏడు కార్పోరేషన్లు .. 20 మున్సిపాల్టీలను గ్రేటర్ లో విలీనం చేసేందుకు సిద్దమైన ప్రతిపాదనల పై ప్రభుత్వ ఆమోద ముద్ర వేయనుంది. గ్రేటర్ ఎన్నికలు సైతం వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఏడాది లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. గ్రేటర్ పరిధి పెంపు ముఖ్యమంత్రి రేవంత్ హైదరాబాద్ కు కొత్త రూపు తెచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా గ్రేటర్హైదరాబాద్మున్సిపల్కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) పరిధిని ఓఆర్ఆర్వరకు విస్తరించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందు కోసం కమిటీ ఏర్పాటు చేయనుంది. అదే సమయంలో గ్రేటర్ ను మూడు కార్పోరేషన్లుగా ఏర్పాటు ప్రతిపాదన పైన చర్చలు జరిగాయి. ఇప్పుడు ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి.. నివేదిక కోరనుంది. ఆ కమిటీ చేసే సిఫార్సులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనుంది.

గ్రేటర్ లో విలీనం జీహెచ్‌ఎంసీని మినహాయిస్తే ఓఆర్‌ఆర్ లోపల 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఉన్నాయి. ఓఆర్‌ఆర్ వరకూ నగరాన్ని ఒకేవిధంగా అభివృద్ధి చేసేందుకు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేష న్లను జీహెచ్‌ఎంసీలో విలీనం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇది అమలు చేయాలంటే ముందుగా సంబంధింత కార్పోరేషన్లు.. మున్సిపాల్టీల్లో తీర్మానం చేయాలి. కానీ, వాటిల్లో కాంగ్రెస్ కు మెజార్టీ లేదు. ఇదే సమయంలో వీటి పాలకవర్గాల గడువు ముగియనుంది. ఎన్నికల అంశం చర్చకు వస్తుంది. ఎన్నికలను వాయిదా వేసి కమిటీ ద్వారా వీటి విలీనం పైన నివేదిక కోరాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో శివారులోని స్థానిక సంస్థల విలీనం, జీహెచ్‌ఎంసీ విభజన అంశాలపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.