నక్సలిజానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని, భద్రతా దళాలు గొప్ప విజయాన్ని నమోదు చేశాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. నక్సలిజం కొనఊపిరితో ఉన్నట్లు చెప్పారు. ఒడిశా-చత్తీస్‌ఘడ్ బోర్డర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో 14 మంది నక్సల్స్ మృతిచెందినట్లు చెప్పారు. చత్తీస్‌ఘడ్‌లోని గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇవాళ 14 మంది నక్సలేట్లు మృతిచెందారు. ఆ మృతుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ నేత జయరాం అలియాస్ చలపతి కూడా ఉన్నారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. నక్సలిజానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. నక్సల్స్ రహిత భారత్ దిశగా కీలక అడుగు పడిందన్నారు. మన భద్రతా దళాలకు ఇది గొప్ప విజయమన్నారు. ఒడిశా-చత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో.. సీఆర్పీఎఫ్, ఎస్ఓజీ ఒడివా, చత్తీస్‌ఘడ్ పోలీసులు 14 మంది నక్సల్స్‌ను జాయింట్ ఆపరేషన్ ద్వారా మట్టుబెట్టారని, నకల్స్ రహిత్ భారత్ లక్ష్యంగా భద్రతా దళాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌తో నక్సలిజం కొన ఊపిరితో ఉన్నట్లు కేంద్ర మంత్రి షా పేర్కొన్నారు.సోమవారం జరిగిన ఆపరేషన్‌లో.. ఇద్దరు మహిళా నక్సలైట్లు మృతిచెందగా, ఓ కోబ్రా జవాన్ గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే సోమవారం రాత్రి, మంగళవారం తెల్లవారుజామున .. మెయిన్‌పుర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మృతిచెందారు. దీంతో నక్సల్స్ మృతుల సంఖ్య 14కు చేరినట్లు ఆయన చెప్పారు.

మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు జయరాం అలియస్ చలపతిపై కోటి రూపాయల నజరానా ఉన్నట్లు గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రకీచా తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర సరిహద్దుల్లో ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు.