ప్రముఖ మలయాళం, తమిళం, తెలుగు సినిమాల్లో నటించిన నటుడు టి.కె. వినాయకన్, తన అల్లరి ప్రవర్తనతో ఇటీవలి కాలంలో వార్తల్లో నిలుస్తున్నాడు. రజనీకాంత్, దుల్కర్ సల్మాన్, మమ్ముట్టి, మోహన్ లాల్, ధనుష్ వంటి స్టార్లతో కలసి పెద్ద సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న ఈ ట్యాలెంటెడ్ నటుడు, నిజ జీవితంలో మాత్రం విలన్ గానూ ప్రవర్తిస్తున్నాడు.వినాయకన్ ప్రధానంగా విలన్ పాత్రలతో పాపులర్ అయ్యాడు. “జైలర్” సినిమాలో అతని నటన ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమాలో ఆయన మెయిన్ విలన్ పాత్ర పోషించి, మంచి ఆదరణ పొందాడు. సినిమా సక్సెస్ అయ్యాక అతను మరింతగా విలన్ పాత్రల్లో బిజీ అవుతాడనే అంచనాలు ఏర్పడినప్పటికీ, గ్యాంగ్ వారీ పాత్రలతో పాటు మద్యంతో సంబంధం ఉన్న వివాదాల కారణంగా అతనికి ఆఫర్లు తగ్గాయి.

ఇప్పటికే మద్యానికి బానిసైన వినాయకన్, పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. మధ్యం సేవించి గోవాలో షాప్ ఓనర్ తో గొడవ పడిన వినాయకన్, తాజాగా పక్కింటి వారికి మత్తులో గొడవ పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటి బాల్కనీ నుంచి పక్కింటి వారు పై అరుస్తూ, అల్లరి చేస్తున్న వినాయకన్‌ను చూస్తూ నెటిజన్స్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మొత్తంగా, 2023 అక్టోబర్‌లో కూడా మద్యంతో న్యూసెన్స్ చేస్తూ, పబ్లిక్ వయోలేషన్ సెక్షన్ కింద వినాయకన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత కూడా గోవాలో మరో వివాదం సృష్టించిన ఇతను, ఇప్పుడు పక్కింటి వారు తో ఘర్షణలు పెడుతూ వార్తల్లో నిలిచాడు.సినిమాల్లో విలన్ పాత్రల్లో ప్రదర్శన ఇవ్వడం, నిజ జీవితంలో వివాదాల్లో చిక్కుకోవడం, వినాయకన్ జీవితం ఇప్పుడు ప్రశ్నలు రేపుతున్న విషయం.