हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

తొలిసారి దర్శకత్వం అంతర్జాతీయ అవార్డు

Divya Vani M
తొలిసారి దర్శకత్వం అంతర్జాతీయ అవార్డు

సినిమా పరిశ్రమలో హీరోయిన్లకు సంబంధించిన మార్పులు ఎప్పుడూ ఆసక్తికరమే.గతంలో స్టార్ హీరోయిన్‌లుగా ప్రేక్షకులను అలరించిన చాలామంది ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. అత్త, అమ్మ, వదిన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అందులో ఒకరు మాత్రం ఈ సెకండ్ ఇన్నింగ్స్‌ను పూర్తిగా విభిన్నంగా తీసుకువెళుతున్నారు.సీనియర్ హీరోయిన్ దేవయాని గురించి చెబుతున్నాం. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి తనదైన ముద్ర వేశారు.

తొలిసారి దర్శకత్వం అంతర్జాతీయ అవార్డు
తొలిసారి దర్శకత్వం అంతర్జాతీయ అవార్డు

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి హీరోల సినిమాల్లో ఆమె చేసిన పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు నటనతో పాటు దర్శకురాలిగానూ తన ప్రతిభను చాటుకుంటున్నారు.దేవయాని తొలి చిత్రం ఆమెకు ఘనత తీసుకొచ్చింది. దర్శకురాలిగా మారిన ఆమె మొదటి సినిమాకే అంతర్జాతీయ అవార్డు అందుకున్నారు. ఇది ఆమె ప్రతిభకు నిదర్శనం. ఇప్పటికీ ఆమె పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ముఖ్యంగా అమ్మ పాత్రల్లో కనిపిస్తున్నారు.పవన్ కళ్యాణ్‌తో ఆమె జోడీగా నటించిన సుస్వాగతం సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఆ చిత్రంలో ఆమె అందం, అభినయం ప్రత్యేకంగా నిలిచాయి. అలాగే మహేష్ బాబు నటించిన నాని సినిమాలో దేవయాని అతడి తల్లిగా నటించారు.

ఈ పాత్రలోనూ ఆమె తన సహజ నటనతో అందరిని మెప్పించారు.జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ మరియు అరవింద సమేత చిత్రాల్లో దేవయాని తన విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ తల్లిగా చేసిన పాత్రలు ఆడియెన్స్‌కు మరపురాని అనుభూతిని కలిగించాయి.ఇప్పుడు దేవయాని చాలా బిజీగా మారారు. తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాషల చిత్రాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నారు. ఆమె కెరీర్ ఇంతవరకు సాఫల్యంగా సాగుతోంది. నటనతోనే కాదు, దర్శకురాలిగానూ సత్తా చాటుతుండటం విశేషం.సీనియర్ నటి దేవయాని తీసుకున్న ఈ కొత్త మార్గం ఇతర నటీమణులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ ఆమెను మరింత ముందుకు నడిపిస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870