Jayashankar for Trump inauguration

ట్రంప్ ప్రమాణ స్వీకారానికి జయశంకర్

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ ఈరోజు స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచంలోని అనేక దేశాల నేతలు హాజరు కానున్నారు. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ధనిక వ్యాపారవేత్తలు, టెక్ నిపుణులు కూడా రానున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచంలో అత్యంత ధనవంతులైన ముగ్గురు టెక్ దిగ్గజాలు హాజరుకానున్నారు. వారిలో ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బర్గ్ ఉన్నారు. వీరితోపాటు భారత సంతతికి చెందిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా కలరు. అయితే ట్రంప్ ప్రమాణ స్వీకారానికి భారత ప్రతినిధిగా కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ హజరువుతున్నారు. ఇప్పటికే ఆయన వాషింగ్టన్ చేరుకున్నారు. మరో పక్క భారత వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ దంపతులు కూడా ట్రంప్ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటున్నారు.

image
image

ఒకప్పుడు ట్రంప్‌ను ‘ఆత్మస్నేహితుడు’ అని పిలిచిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వేడుకలో పాల్గొనడం లేదు. భారత్ తరఫున జై శంకర్ పాల్గొంటున్నారు. దీంతోపాటు భారత పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ హాజరవుతున్నారు. ఇప్పటికే ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రెండు రోజుల ముందు, రాజధాని వాషింగ్టన్ డీసీలో వేలాది మంది వచ్చారు. మరోవైపు పదవీ విరమణ చేస్తున్న అధ్యక్షుడు జై బిడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పాత వేడుక సంప్రదాయాన్ని పునరుద్ధరిస్తున్నారు. దీనిలో ఓడిపోయిన అభ్యర్థులు విజేతలతో వేదికను పంచుకుంటారు.

కాగా, మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ. బుష్, బిల్ క్లింటన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తన వీడ్కోలు ప్రసంగంలో అమెరికా కొంతమంది టెక్ బిలియనీర్ల ఆధిపత్యంలో ఉన్న ఒక సామ్రాజ్యం మారవచ్చని బైడెన్ వ్యాఖ్యానించారు. కానీ అక్కడి కార్యాలయం అతిథుల అధికారిక జాబితాను విడుదల చేయలేదు. ఈ జాబితా గురించి ఇంకా చాలా చర్చలు కొనసాగుతున్నాయి. ట్రంప్ వేడుకకు హాజరయ్యే వ్యక్తుల జాబితాలో ప్రపంచంలోని అతిపెద్ద నాయకులు, మిత్రులు, స్నేహితులు, శత్రువులు సహా అనేక మంది ఉన్నట్లు తెలుస్తోంది. కీలకమైన వ్యక్తులు రానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ఘనంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

Related Posts
శంషాబాద్‌లో వైష్ణోయ్ సౌత్‌వుడ్స్‌ను ఆవిష్కరించిన వైష్ణోయ్ గ్రూప్
Vaishnoi Group Launches Vai

హైదరాబాద్, నవంబర్ 15, 2024 - శంషాబాద్‌లోని మామిడిపల్లిలో ప్రత్యేక విల్లా కమ్యూనిటీ వైష్ణోయ్ సౌత్‌ వుడ్స్‌ను ప్రారంభించినట్లు వైష్ణోయ్ గ్రూప్ సగర్వంగా ప్రకటించింది. ఈ గ్రాండ్ Read more

ఎమ్మెల్సీ కవిత ఫొటోల మార్ఫింగ్ – పోలీసులకు ఫిర్యాదు
MLC Kavitha's photo morphin

తెలంగాణ జాగృతి మహిళా విభాగం ఎమ్మెల్సీ కవిత ఫొటోలను మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కవిత ఫొటోలను మార్ఫింగ్ Read more

మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారం
woman constable

యూపీ లోని కాన్పూర్‌లో ఒక మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం జరిగింది. అయోధ్యలో విధులు నిర్వహిస్తున్న 34 సంవత్సరాల మహిళా కానిస్టేబుల్ కర్వా చౌత్ జరుపుకునేందుకు కాన్పూర్ బయలుదేరారు. Read more

DANGER: ఆల్కహాల్ తాగుతున్నారా?
Are you drinking alcohol

మద్యం సేవించే అలవాటు వల్ల 40 ఏళ్ల వ్యక్తి వెంటిలేటర్ పై చావుబతుకుల్లో ఉన్నాడు. మద్యం తాగితే కాలేయం పాడవుతుందని పొరబడుతుంటారు. కానీ, ఆల్కహాల్ అనేది విషంతో Read more