నందమూరి బాలకృష్ణ వయసు 64 కు చేరుకున్న..ఇప్పటికి యంగ్ హీరోలతో పోటీ పడుతున్నాడు. వరుస హిట్ల తో ఫుల్ స్వింగ్ లో ఉన్న బాలయ్య ను చూసి ఆ ఎనర్జ్ ఏంటి..? ఆ ఉత్సాహం ఏంటి..? అసలు బాలకృష్ణ ఫిట్నెస్ రహస్యం ఏంటో అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో తన ఫిట్నెస్ రహస్య ఏంటో బాలయ్య చెప్పుకొచ్చారు.
తాను ఫిట్‌గా ఉండేందుకు ప్రత్యేక రహస్యం ఏమీ లేదని బాలకృష్ణ తెలిపారు. షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ ఫుడ్ తింటానని పేర్కొన్నారు. ‘డాకు మహారాజ్’ ప్రమోషన్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. ఫుడ్ విషయంలో భార్య వసుంధర తనను తిడుతుందన్నారు. కాగా పార్టీలకు, కులాలకు అతీతంగా తనకు అందరు ఫ్యాన్స్ ఉన్నారని చెప్పారు. అదే తాను సంపాదించిన ఆస్తి అని బాలయ్య తెలిపారు.
తాజాగా బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ తో సంక్రాంతి బరిలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. బాబీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మించారు.