ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025

ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025

ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 న్యూఢిల్లీలోని భారత్ లో వైభవంగా కొనసాగుతోంది.ఈ ఎక్స్‌పో రెండో రోజు (జనవరి 18, 2025) పలు ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు తమ అత్యాధునిక వాహనాలను ప్రదర్శించాయి.ఎలక్ట్రిక్ వాహనాల నుంచి సంప్రదాయ వాహనాల వరకు అనేక ఆకర్షణీయమైన మోడళ్లతో ప్రదర్శనను ఆసక్తికరంగా మార్చాయి.మొబిలిటీ రంగంలో వచ్చిన కొత్త సాంకేతికతలను ప్రదర్శిస్తూ ప్రముఖ కంపెనీలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ కంపెనీ తమ ఆధునిక ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ మరియు మైక్రో ఫోర్-వీలర్ కాన్సెప్ట్ మోడళ్లను ఆవిష్కరించింది.ఈ సందర్భంగా హ్యుందాయ్, భారతీయ సంస్థ TVS మోటార్ కంపెనీ లిమిటెడ్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది.భారత మొబిలిటీ మార్కెట్‌లో కొత్త ఆవిష్కరణలు ప్రవేశపెట్టేందుకు ఈ భాగస్వామ్యం సహాయపడనుంది.

Advertisements
ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025
ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025

హ్యుందాయ్ ప్రదర్శించిన క్రెటా ఎలక్ట్రిక్ కారుతో పాటు, త్రీ-వీలర్ మరియు మైక్రో ఫోర్-వీలర్ కాన్సెప్ట్ మోడల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి.హ్యుందాయ్ మోటార్ డిజైన్,ఇంజనీరింగ్, సాంకేతికతలో ఆధునికతను సమ్మిళితం చేస్తూ TVS మోటార్‌తో కలిసి పని చేయనుంది.”TVS మోటార్‌తో కలిసి ప్రపంచవ్యాప్తంగా నాలుగు చక్రాల వాహన అవకాశాలను అన్వేషిస్తున్నాం.స్థానికంగా మూడు చక్రాల వాహనాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం,” అని హ్యుందాయ్ అండ్ జెనెసిస్ గ్లోబల్ డిజైన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హెడ్ సాంగ్యూప్ లీ చెప్పారు.హ్యుందాయ్ ప్రదర్శించిన మైక్రో మొబిలిటీ కాన్సెప్ట్ వాహనాలు వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి.

ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ కాన్సెప్ట్ స్మార్ట్ డిజైన్‌తో తక్కువ ప్రదేశాల్లో సౌకర్యంగా నడిచేలా రూపొందించారు. వాహనం ఎత్తును సర్దుబాటు చేయడం ద్వారా వర్షాకాలంలో నీటితో నిండిన వీధుల్లో సులభంగా ప్రయాణించగలుగుతుంది. ఆకాషి బ్లూ రంగులో రూపొందిన ఈ వాహనం, పెద్ద టైర్లతో కఠినమైన రహదారులపై సైతం సాఫీగా నడవగలదు.

ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 17న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025ను ప్రారంభించారు. ఇది దేశంలోని అతిపెద్ద మొబిలిటీ ఎక్స్‌పోగా గుర్తింపు పొందింది. ఈ ఎక్స్‌పో జనవరి 17 నుండి 22 వరకు భారత్ మండపం యశోభూమి, ఇండియా ఎక్స్‌పో సెంటర్, గ్రేటర్ నోయిడాలోని మార్ట్‌లో కొనసాగనుంది. 9 ప్రదర్శనలు, 20కి పైగా సమావేశాలు, వివిధ రాష్ట్రాల ప్రత్యేక సమావేశాలతో ఈ ఎక్స్‌పో మరింత వైభవంగా సాగుతోంది.

Related Posts
స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసే ఏఐ ఏజెంట్‌ ను రూపొందించిన చైనా
స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసే ఏఐ ఏజెంట్‌ ను రూపొందించిన చైనా

చైనా మరో అద్భుతానికి నాంది పలికింది. మానవ సహాయం లేకుండానే పూర్తిగా స్వతంత్రంగా పనిచేసే ఏఐ ఏజెంట్ "మానస్"ను రూపకల్పన చేసింది. షెంజెన్‌కు చెందిన మోనికా.ఐమ్ అనే Read more

ఈ ఏసీలపై బంపర్‌ ఆఫర్‌
ఈ ఏసీలపై బంపర్‌ ఆఫర్‌

దేశంలో వాతావరణం మారిపోయింది. ఎండలు మొదలైపోయాయి. సమ్మర్‌ రావడంతో చాలా మంది ఏసీలు, కూలర్ల ముందు ఉండిపోతుంటారు. సమ్మర్‌ మొదలు కావడంతో చాలా మంది ఏసీలు, కూలర్లను Read more

సెబీ మాజీ చీఫ్ మాధబి పూరీ బుచ్ పై ఏసీబీ కేసు
సెబీ మాజీ చీఫ్ మాధబి పూరీ బుచ్ పై ఏసీబీ కేసు

భారత స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ మాజీ చైర్మన్ మాధబి పూరి బుచ్ ప్రస్తుతం కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నారు. గతంలో అదానీకి ఆమె సహాయం చేశారంటూ Read more

Stock Market : ట్రంప్ దెబ్బకు మార్కెట్లు కుదేల్
ట్రంప్ ప్రకటన దెబ్బకి షేర్స్ ఢమాల్...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఊహించని కలకలానికి దారితీసింది. విదేశీ కంపెనీలు అమెరికాలో తమ ఉత్పత్తులను అమ్మాలంటే కనీసం Read more

×