ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మంచు కుటుంబ వివాదం హాట్ టాపిక్‌గా మారింది.తండ్రి మోహన్‌బాబు, కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్‌ల మధ్య నెలకొన్న అంతర్గత కలహాలు అంతు చూపకుండా కొనసాగుతున్నాయి. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకునే వరకు ఈ వివాదం తీవ్రత పెరిగింది.ఇప్పుడు వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ప్రారంభమైనట్లు తెలుస్తోంది.సోషల్ మీడియా వేదికగా మంచు బ్రదర్స్ వరుసగా పోస్ట్‌లు పెడుతూ హీటెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. “కలిసి కూర్చొని మాట్లాడుకుందాం.నాన్న, ఇంట్లోని మహిళలు, ఉద్యోగులు మిగిలిన వాళ్లను పక్కనబెట్టి మనమే చర్చించుకుందాం.

నేను ఒంటరిగానే వస్తానని మాటిస్తున్నా.నీకు నచ్చిన వాళ్లను నువ్వు తీసుకురావచ్చు లేదా మనం ఆరోగ్యకరమైన డిబేట్ పెట్టుకుందాం” అని ఆయన పేర్కొన్నారు.అయితే ఈ పోస్ట్‌లో మనోజ్ ఏదైనా వ్యక్తిని ప్రత్యేకంగా ఉద్దేశించారో లేదో మాత్రం స్పష్టత లేదు.తాజాగా మంచు కుటుంబం సంబరాల మధ్య మరోసారి వివాదంలోకి దిగిపోయింది. సంక్రాంతి పండుగ సందర్భంగా మంచు మనోజ్, మౌనిక దంపతులు తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీకి వెళ్లడంతో మరోసారి గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ వివాదం కూడా పోలీస్ కేసుల వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో మంచు బ్రదర్స్ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.మంచు విష్ణు తన సినిమాలోని డైలాగ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వ్యాఖ్యానించారు.”సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది..
కానీ వీధిలో మొరగటానికి, అడవిలో గర్జించటానికి తేడా ఉంటుంది” అని పోస్ట్ చేశారు.దీనికి తమ్ముడు మంచు మనోజ్ కౌంటర్‌గా ట్వీట్ చేశారు. కృష్ణంరాజు నటించిన ‘భక్త కన్నప్ప’లోని పోస్టర్‌ను షేర్ చేస్తూ, “సింహం అవ్వాలని ప్రతి కుక్కకీ ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్” అంటూ వ్యాఖ్యానించారు.అంతేకాకుండా, VisMith అనే హ్యాష్‌ట్యాగ్ జోడించి, తన హాలీవుడ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన క్లూను కూడా ఇస్తూ పోస్ట్ చేశారు. మంచు బ్రదర్స్ మధ్య జరుగుతున్న ఈ ట్వీట్లు అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీశాయి. నెటిజన్లు ఈ పోస్ట్‌లపై వివిధ రకాలుగా స్పందిస్తూ, తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.ఇప్పటికే పోలీస్ కేసులు, సోషల్ మీడియా వివాదాలతో మంచు కుటుంబం వార్తల్లో నిలిచింది. ఈ కుటుంబ కలహం ఎలా ముగుస్తుందో, మంచి పరిష్కారం కనుగొనబడుతుందో వేచి చూడాల్సిందే.