हिन्दी | Epaper
నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం?

రంజీ ట్రోఫీ రెండో దశ ఎప్పుడంటే.

Divya Vani M
రంజీ ట్రోఫీ రెండో దశ ఎప్పుడంటే.

రంజీ ట్రోఫీ రెండో దశ జనవరి 23న ప్రారంభం కానుంది.ఈ టోర్నమెంట్ బీసీసీఐకు చాలా ముఖ్యమైనది, కాబట్టి ఈ రెడ్ బాల్ క్రికెట్‌పై దృష్టి సారిస్తోంది. రంజీ ట్రోఫీలో పాల్గొనే ఆటగాళ్లు ఒక మ్యాచ్ ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. మరి, రంజీ ఆటగాళ్ల జీతం ఎంత అనేది తెలుసుకుందామా 2024 చివర్లో రంజీ ట్రోఫీ ఒక దశ ముగిసింది.ఇప్పుడు రెండో దశ జానవరి 23 నుంచి మొదలవుతుంది.ఈ టోర్నమెంట్ క్రికెట్‌లో కీలకమైనది.బీసీసీఐ కూడా దీనికి ప్రాధాన్యత ఇస్తోంది.అయితే, రంజీ ఆటగాళ్లు ఒక మ్యాచ్‌లో ఎంత సంపాదిస్తారో తెలుసుకోవాలా? రంజీ ఆటగాళ్లు రోజువారీగా వారి అనుభవం ఆధారంగా జీతాలు పొందుతారు.

రంజీ ట్రోఫీ రెండో దశ ఎప్పుడంటే.
రంజీ ట్రోఫీ రెండో దశ ఎప్పుడంటే.

41 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు,ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగమైన తర్వాత,రోజుకు ₹60,000 వరకు పొందుతారు.ఒక మ్యాచ్‌లో (నాలుగు రోజుల) ₹2.40 లక్షలు సంపాదిస్తారు.ఈ కేటగిరీలో రిజర్వ్ ఆటగాళ్లకు రోజుకు ₹30,000 లభిస్తాయి.21 నుంచి 40 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లకు రోజుకు ₹50,000 మరియు మొత్తం మ్యాచ్‌కు ₹2 లక్షలు. రిజర్వ్ ఆటగాళ్లకు ఈ కేటగిరీలో రోజుకు ₹25,000 లభిస్తాయి. 0 నుంచి 20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లకు రోజుకు ₹40,000 మరియు మొత్తం మ్యాచ్‌కు ₹1.60 లక్షలు లభిస్తాయి. ఈ ఆటగాళ్ల రిజర్వ్ స్ధితిలో ఉన్న వారు రోజుకు ₹20,000 సంపాదిస్తారు.

రంజీ ట్రోఫీ భారత క్రికెట్‌లో ఒక గొప్ప చరిత్రను కలిగి ఉంది. స్వతంత్ర భారతదేశానికి ముందు 1934-35లో ప్రారంభమైన ఈ టోర్నమెంట్ ఇప్పటి వరకు కొనసాగుతుంది. భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉండగా, నవనగర్ (ప్రస్తుతం జామ్‌నగర్) మహారాజా రంజిత్ 1896-1902 మధ్య ఇంగ్లాండ్ తరపున 15 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. ఆయన పేరు ఈ టోర్నమెంట్‌కు పెట్టబడింది.రంజీ ట్రోఫీ ఆటగాళ్ల జీతాల వివరాలు చూస్తుంటే, ఈ టోర్నమెంట్ ఆటగాళ్లకు ఎంత గొప్ప అవకాశాలను ఇస్తుందో అర్థం అవుతుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870