Headlines
ఆపిల్ ఫోన్ల ఉత్పత్తిలో కళ్లు చెదిరే రికార్డు

ఆపిల్ ఫోన్ల ఉత్పత్తిలో కళ్లు చెదిరే రికార్డు

ఐఫోన్‌లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఒక్కరూ కొత్త మోడల్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. కొత్త మోడల్ మార్కెట్లోకి వస్తే వెంటనే కొనుగోలుకు పోటీపడుతారు.ఇతర బ్రాండ్స్‌తో పోల్చితే ఐఫోన్ ధరలు ఎక్కువైనా, అందులో ఉన్న ఫీచర్లు, టెక్నాలజీ దృష్ట్యా అది న్యాయమైనదే.ఐఫోన్ వాడటం ఒక స్టేటస్ సింబల్‌గా మారింది.ఇక భారత్‌లో ఐఫోన్ల ఉత్పత్తి కొత్త రికార్డులను సృష్టిస్తోంది. 2024లో ఐఫోన్ ఎగుమతులు రూ.లక్ష కోట్లను దాటి వెళ్లాయి.ఇది దేశానికి గర్వకారణం. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం ద్వారా భారత్‌లో తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది.ఆపిల్ సంస్థ ఈ పథకాన్ని ఉపయోగించుకుని భారీ స్థాయిలో ఉత్పత్తి పెంచింది.

2024లో భారతదేశం నుంచి 12.8 బిలియన్ డాలర్ల (రూ.1.08 లక్షల కోట్లు) విలువైన ఐఫోన్లు ఎగుమతి అయ్యాయి.ఇది గత ఏడాదితో పోలిస్తే 42% వృద్ధిని నమోదు చేసింది. దేశీయ ఉత్పత్తి 46% పెరిగింది. ఫాక్స్‌కాన్, పెగాట్రాన్, విస్ట్రాన్ వంటి ప్రముఖ సంస్థలు భారత్‌లో పెట్టుబడులు పెట్టి, ఉత్పత్తి చేస్తున్నాయి. వీటి ద్వారా 1.85 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు కలిగాయి. ఆసక్తికరంగా, ఈ ఉద్యోగాల్లో 70% మంది మహిళలు.భారత్‌లో ఆపిల్ సంస్థ వేగంగా అభివృద్ధి చెందుతూ బ్లూ కాలర్ ఉద్యోగాలను విస్తరిస్తోంది. ఐఫోన్ల ఎగుమతులు ఇలాగే కొనసాగితే, సంవత్సరానికి 20 బిలియన్ డాలర్ల ఉత్పత్తి సాధ్యమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

దీంతో భారత్‌లో ఐఫోన్ ఉత్పత్తి వాటా 14% నుంచి 26%కి పెరగనుంది.తమిళనాడులో ఉన్న ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీ దేశంలోనే అతిపెద్ద ఐఫోన్ ఉత్పత్తి కేంద్రంగా మారింది. అక్కడ 42,000 మంది పనిచేస్తున్నారు. వీరిలో 30,000 మంది మహిళలు కావడం గర్వకారణం. ఇలా భారత్‌ను తమ ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా మార్చుకుంటూ, ఆపిల్ మన ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వామిగా మారుతోంది.ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం ద్వారా కంపెనీలకు పన్ను రిబేట్లు, దిగుమతుల సుంకాల్లో సడలింపు లభిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fka twigs dances martha graham : ‘this is art in its truest form’. Advantages of local domestic helper. Rapat paripurna dprd kota batam, pemerintah kota batam ajukan 8 poin ranperda.