బ్రిటన్ యువరాజు విలియం సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ క్యాన్సర్ నుంచి కోలుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఇన్ స్టా వేదికగా పోస్టు పెట్టారు. ఇప్పుడు చాలా ఉపశమనంగా ఉందని, ఇక నుంచి పూర్తిగా కోలుకోవడం పైనే దృష్టిసారించినట్లు తెలిపారు. అయితే సాధారణ స్థితికి రావడానికి ఇంకాస్త సమయం పడుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు విలియమ్‌తో కలిసి ఆసుపత్రిని సందర్శించారు.

తాను క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ గతేడాది మార్చిలో ప్రకటించిన విషయం తెలిసిందే. అనారోగ్యం వల్ల జనవరిలో పొత్తికడుపు శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. శస్త్రచికిత్స విజయవంతం అయినప్పటికీ ఆ తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో తనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు. ఇక అప్పటి నుంచి ఆమె బయటి ప్రపంచానికి కనిపించలేదు. పలు దశల వారీగా కీమోథెరపీ చేయించుకున్నారు. ఈ సందర్బంగా కేట్ మిడిల్టన్ చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగులను పరామర్శించారు. గతేడాది చికిత్స సమయంలో ఆసుపత్రి సిబ్బంది తనను చాలా బాగా చూసుకున్నట్లు కేట్ మిడిల్టన్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ మేరకు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.