हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు నాంపల్లి కోర్టు అనుమతి

Divya Vani M
అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు నాంపల్లి కోర్టు అనుమతి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు సంబంధించి ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే కొన్ని షరతులతో అల్లు అర్జున్‌కు కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ షరతుల్లో సడలింపు ఇస్తూ న్యాయస్థానం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసే వరకు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు హాజరుకావాలని కోర్టు అప్పట్లో బెయిల్ షరతుల్లో పేర్కొంది. అయితే తాజాగా ఈ షరతు నుంచి మినహాయింపు ఇచ్చింది. గత ఆదివారం అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు హాజరైనప్పుడు ఆయనను చూడటానికి భారీగా అభిమానులు గుమిగూడారు.

hero allu arjun in nampally court
hero allu arjun in nampally court

దీనివల్ల అక్కడ సెక్యూరిటీ సమస్యలు తలెత్తాయి.ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ, ప్రతి ఆదివారం స్టేషన్‌కు హాజరుకావడం వల్ల సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బన్నీకి ఊరట కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.కోర్టు తాజా ఉత్తర్వుల ప్రకారం, ఇకపై అల్లు అర్జున్‌కు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యే అవసరం లేదు.

అభిమానుల గుమికూడుదల వల్ల ఏర్పడే భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకుని న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.అల్లు అర్జున్‌కు ఇది పెద్ద ఊరటగా మారింది. ప్రస్తుతం ఆయన ఈ సమస్యల నుండి బయటపడి తన ప్రాజెక్ట్స్‌పై దృష్టి సారించే అవకాశముంది.అల్లు అర్జున్‌కు సంబంధించి కోర్టు తీసుకున్న ఈ తాజా నిర్ణయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అభిమానులు ఈ విషయాన్ని ప్రస్తుతం అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాల పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి వచ్చిన ఈ ఊరట ఆయనకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఆయన తదుపరి ప్రాజెక్ట్స్‌పై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870