Headlines
revanth reddy

సోలార్ పవర్ స్టేషన్ల ఏర్పాట్లు: రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ఆటో మొబైల్ రంగంపై దృష్టి పెడుతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం శుక్రవారం హైదరాబాద్‌ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సీఐఐ ప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో మహిళాభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని చెప్పారు.

ఈ సందర్భంగా సీఐఐ ప్రతినిధులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని, చంద్రమండలానికి వెళ్తున్నాం.. కానీ భూమిపైన ఎలా ఉండాలో మాత్రం తెలుసుకోలేకపోతున్నామని అన్నారు. కాలుష్యకారక వాహనాలను అవుటర్ రింగ్ రోడ్డు అవతలికి తరలిస్తున్నామన్నారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాల్లో 67 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని, ప్రభుత్వ కార్యాలయాల్లో స్వయం సహాయక మహిళా సంఘాలతో క్యాంటీన్లు ఏర్పాటు చేయించామన్నారు.

మహిళా సంఘాలతో సోలార్ పవర్ స్టేషన్లు ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేసేలా మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నామని, హైటెక్ సిటీ పక్కనే మహిళా సంఘాల ఉత్పత్తులను విక్రయించుకునేందుకు మూడున్నర ఎకరాల స్థలంలో స్టాల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Best new artificial intelligence search engine. Diamond mailer clear cut e mailer solutions. Warehouse.