हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుకుంటున్న చరణ్

Divya Vani M
ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుకుంటున్న చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన చిత్రం గేమ్ ఛేంజర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఇటీవల నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోలో పాల్గొన్నారు. ఈ షోలో తన జీవితానికి, సినిమాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో, ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షో ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసి, ఇప్పుడు నాలుగో సీజన్‌లో అడుగు పెట్టింది.

ram charan mahesh prabhas
ram charan mahesh prabhas

తొమ్మిదో ఎపిసోడ్‌కు ప్రత్యేక అతిథిగా రామ్ చరణ్ హాజరయ్యారు. చరణ్‌తో పాటు హీరో శర్వానంద్, నిర్మాత దిల్ రాజు కూడా పాల్గొన్నారు.ఈ షో ప్రోమో తాజాగా విడుదల కాగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. బాలయ్య తన శైలిలో చరణ్‌ను ఆసక్తికర ప్రశ్నలతో ఇరుకున పెట్టడం, చరణ్ ఆ ప్రశ్నలకు కూల్‌గా సమాధానమివ్వడం అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ టాక్ షోలో బాలయ్య రామ్ చరణ్‌ను సామ్, కియారా, అలియాల్లో ఎవరు ఉత్తమ నటి అని ప్రశ్నించారు.

దీనికి సమంత అని సమాధానమిచ్చాడు చరణ్. అంతే కాకుండా, మహేష్ బాబు మరియు ప్రభాస్ ఇద్దరిలో ఒకరితో మల్టీస్టారర్ చేసే అవకాశం వస్తే ఎవరిని ఎంచుకుంటారనే ప్రశ్నకు, మహేష్ బాబు అని చెప్పారు.ఇక, ప్రభాస్‌తో తన స్నేహంపై కూడా చరణ్ హుందాగా మాట్లాడాడు. గతంలో ప్రభాస్ ఈ షోలో వచ్చినప్పుడు రామ్ చరణ్‌కు కాల్ చేశాడని గుర్తు చేస్తూ, ఈసారి చరణ్ కూడా ప్రభాస్‌కు కాల్ చేసి మాట్లాడాడు.రామ్ చరణ్ తన కుమార్తె క్లింకార గురించి ఎంతో భావోద్వేగంగా మాట్లాడాడు. “అవును, నా కూతురు నన్ను ‘నాన్న’ అని పిలిచినప్పుడు నా ఫోటోను బయటపెడతాను” అని చెప్పాడు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870