हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

రైతు సంఘాలతో భేటీకి రాష్ట్రపతి నిరాకరణ

sumalatha chinthakayala
రైతు సంఘాలతో భేటీకి రాష్ట్రపతి నిరాకరణ

చండీగఢ్‌ : సమయాభావం కారణాన్ని చూపుతూ సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్కేఎం) ప్రతినిధులతో సమావేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిరాకరించారు. పంటలకు గిట్టుబాటు ధరలు, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, రుణభారం తదితర సమస్యలకు పరిష్కారం చూపేందుకు జోక్యం చేసుకోవాలని కోరేందుకు రాష్ట్రపతి ముర్ముతో భేటీకి ఎస్కేఎం ప్రతినిధులు సోమవారం సమయం కోరారు. సమయం కేటాయించాలని కోరుతూ తాము చేసిన అభ్యర్థనకు లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చినందుకు ఎస్కేఎం రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపింది.

image
image

సమయాభావం కారణంగా రైతుల ప్రతినిధులను కలుసుకోవడానికి ఆమె నిరాకరించడం పట్ల ఎస్కేఎం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాని మోడీ, సుప్రీంకోర్టు పరిష్కరించలేక పోయిన ఈ ప్రతిష్టంభనను తొలగించి, గత 41 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ ప్రాణాలను కాపాడేందుకు నిర్మాణాత్మక చర్యలు చేపట్టేందుకు వీలుగా రైతుల ఆందోళన విషయంలో జోక్యం చేసుకోవాలన్న తమ అభ్యర్థనను రాష్ట్రపతి భవన్‌ సమీక్షించగలరని ఎస్కేఎం ఆశాభావం వ్యక్తం చేసింది. సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత రాష్ట్రపతిపై ఉందని పేర్కొంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870