ఇలా జరుగుతుందని తెలుసుంటే ఆ సినిమా చేసేదాన్ని కాదు

ఇలా జరుగుతుందని తెలుసుంటే ఆ సినిమా చేసేదాన్ని కాదు.

కీర్తి సురేష్, దక్షిణాది సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో ఒకరు. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి, ఆ వెంటనే మహానటి చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా ఆమె అద్భుతమైన నటనతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకుంది. ఈ సౌత్ ఇండస్ట్రీలో సత్తా చాటిన కీర్తి ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగు పెట్టింది.సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో కీర్తి ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది.

Keerthy Suresh
Keerthy Suresh

కేవలం హీరోయిన్‌గా కాకుండా, మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్ వంటి పెద్ద హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది.అందం, అభినయంతో అభిమానులను ఆకర్షించిన కీర్తి, ఫ్యామిలీ ఎంటర్టైనర్, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. మహానటి సినిమా ద్వారా ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు గెలిచింది.కీర్తి తన కెరీర్లో మొదట్లో ట్రెడిషనల్ లుక్స్‌లో కనిపించినా, ఇప్పుడు గ్లామర్ పాత్రల్లో కూడా కనిపిస్తోంది. కెరీర్ పిక్స్‌లో ఉన్నప్పుడే తన స్నేహితుడు ఆంటోనిని పెళ్లి చేసుకుంది. గోవాలో డిసెంబర్ 12న ఆంటోని‌తో పెళ్లి చేసుకున్న కీర్తి, పెళ్లి తరువాత కొత్త సినిమాలు ప్రకటించలేదు.

ఇప్పుడు కీర్తి బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. వరుణ్ ధావన్ సరసన బేబీ జాన్ సినిమాలో నటించింది. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన తేరి సినిమా రీమేక్. అయితే, భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేకపోయింది.కీర్తి తాజాగా ఒక భేటీలో పాల్గొని బేబీ జాన్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. బేబీ జాన్ సినిమా ముందు, కీర్తి రఘు తాత అనే సినిమాలో నటించింది. ఈ చిత్రంలో హిందీ నేర్చుకోవాల్సిన ఒత్తిడి విషయాన్ని సీరియస్‌గా చూపించబడింది. ఈ సినిమా ట్రైలర్‌లో “హిందీ తెలియదు పోవయ్యా” అనే డైలాగ్ ఉంది.

Related Posts
గాయపడిన రష్మిక మందన!
గాయపడిన రష్మిక మందన!

'యానిమల్', 'పుష్ప 2: ది రూల్' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో వరుస విజయాలను సాధించిన రష్మిక మందన ప్రస్తుతం తన రాబోయే చిత్రం సికందర్లో పని Read more

ఏపీ ఉమెన్ ఎంపవర్ మీనాక్షి అంటూ ప్రచారం
ఏపీ ఉమెన్ ఎంపవర్ మీనాక్షి అంటూ ప్రచారం

ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా సాధికారత బ్రాండ్ అంబాసిడర్ గా టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించారంటూ అనేక వార్తలు వెలువడుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ Read more

రష్మికకు గాయం.. ఆగిపోయిన సినిమా షూటింగులు..
రష్మికకు గాయం.. ఆగిపోయిన సినిమా షూటింగులు..

పుష్ప 2 తర్వాత రష్మిక మందన్నా క్రేజ్ మరింత పెరిగిపోయింది.ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో బిజీగా ఉంది. "పుష్ప" హిట్తుతో ఆమె కెరీర్ టాప్‌ Read more

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం యువ నటి దుర్మరణం
act

సముద్రపు అలల దారుణం: యువ నటి దుర్మరణం సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. తనకు ఇష్టమైన సముద్ర తీరాన యోగా చేసేందుకు వెళ్లిన 24 Read more