votar card

ఓటర్ కార్డు ఓటుకు గ్యారంటీ కాదు: ఈసీ

ఇటీవల జరిగిన ఎన్నికలపై పలు అనుమానాలకు తావు వున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓటర్ కార్డు ఉన్నంత మాత్రాన ఓటేసే హక్కు ఉన్నట్లు కాదని ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఓటర్ల జాబితాను అప్ డేట్ చేస్తున్నారు. జనవరి 1 తో పద్దెనిమిదేళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

యువతలో అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు, ఓటరు నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అర్హులను ఓటర్ జాబితాలో చేర్చడంతో పాటు అనర్హులు, మరణించిన వారి పేర్లను తొలగిస్తున్నారు.


సవరించిన ఓటర్ల జాబితా
ఇందులో భాగంగా గతేడాది ఆగస్టులో బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటి సర్వే నిర్వహించారని సీఈసీ వెల్లడించారు. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, కొత్త ఓటర్ల పేర్లను చేర్చి మొత్తంగా సవరించిన ఓటర్ల జాబితాను ఈ నెల 6న విడుదల చేయనున్నట్లు ఢిల్లీ సీఈసీ ఆఫీసు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలోనే తప్పుడు పత్రాలతో ఓటర్ ఐడీ పొందిన ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసినట్లు వివరించింది. ఒకటి కంటే ఎక్కువ ఐడీ కార్డులు కలిగి ఉండడం కూడా శిక్షార్హమైన నేరమని పేర్కొంది. ఓటర్ కార్డు ఉందంటే ఓటేసేందుకు గ్యారంటీ కాదని తెలిపింది.

Related Posts
భారీగా ఉద్యోగులను తొలగించిన ఓలా ఎలక్ట్రిక్
భారీగా ఉద్యోగులను తొలగించిన ఓలా ఎలక్ట్రిక్

గత ఏడాది స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ తర్వాత భవిష్ అగర్వాల్ కలల ప్రాజెక్ట్ ఓలా ఎలక్ట్రిక్ లాభాల బాట పట్టేందుకు ప్రయత్నిస్తోంది. పెట్టుబడిదారుల నుంచి వస్తున్న హీట్ Read more

Ramjan : బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో రంజాన్ కు కిట్ల పంపిణీ
బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో రంజాన్ కు కిట్ల పంపిణీ

ముస్లింలు జరుపుకొనే అతి పెద్ద పండుగ.. రంజాన్. నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలను పాటించిన అనంతరం భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. ఈ నెల Read more

ఫేక్ కేసులో అతిషీని అరెస్ట్: కేజ్రీవాల్
ఫేక్ కేసులో అతిషీని అరెస్ట్: కేజ్రీవాల్

ఫేక్ కేసులో అతిషీని అరెస్ట్ చేయాలనీ ఈడీ, సీబీఐకి బీజేపీ నుంచి ఆదేశాలు: కేజ్రీవాల్ ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిన మహిళా సమ్మాన్ యోజన మరియు సంజీవని యోజన Read more

ప్రతి రూపాయికి 2.52 రూపాయలు: ఇస్రో చీఫ్
ప్రతి రూపాయికి 2.52 రూపాయలు: ఇస్రో చీఫ్

భారతదేశం అంతరిక్షంలో వెచ్చించే ప్రతి రూపాయికి రూ. 2.52 చేసింది: ఇస్రో చీఫ్ భారతదేశం అంతరిక్ష రంగంలో మైలురాయి ప్రతిపాదనను ఈ సంవత్సరం వెల్లడించింది. భారత అంతరిక్ష Read more