ttd temple

తెలంగాణ ఎమ్మెల్యేకు టీటీడీ గుడ్ న్యూస్

తెలంగాణలో ప్రజా ప్రతినిధులకు తిరుమల, తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో ఇకపై తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో తెలంగాణ సిఫార్సు లేఖలకు చిక్కులు తొలగినట్లే. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమైన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు ఈ మేరకు సమాచారం ఇచ్చారు. తెలంగాణ నుంచి స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పంపే సిఫార్సు లేఖల ఆధారంగా తిరుమలలో శ్రీవారి దర్శనం కేటాయింపుల్లో ఈ మధ్య సమస్యలు తలెత్తాయి. దీంతో తెలంగాణకు చెందిన అధికార, విపక్ష పార్టీలు కూడా దీనిపై అసంతృప్తిగా ఉన్నాయి. తొలుత ఈ విషయంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన విమర్శలపై టీటీడీ ఛైర్మన్ తీవ్రంగా స్పందించారు. తిరుమలలో వివక్ష పేరుతో రాజకీయాలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు.
తిరుమల దర్శనానికి వచ్చే తెలంగాణ భక్తులపై వివక్ష చూపుతున్నారనే విమర్శలు రావడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

 ttd temple


వారానికి 4 సిఫార్సు లేఖలకు అంగీకారం
ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమైన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై చర్చించారు. ఈ భేటీలో వీరు ప్రజా ప్రతినిధులకు శుభవార్త చెప్పారు. ఇకపై తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు ,ఎమ్మెల్సీలకు వారానికి 4 సిఫార్సు లేఖలను అంగీకరించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు అంగీకరించారు. ఇందులో వారానికి రెండు బ్రేక్ దర్శనాలతో పాటు మరో రెండు మూడు వందల రూపాయల దర్శనానికి సిఫార్సు లేఖలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.

Related Posts
దావోస్ నుంచి ‘ఖాళీ చేతులతో’ వచ్చారు: రోజా
దావోస్ నుంచి ‘ఖాళీ చేతులతో’ వచ్చారు: రోజా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దావోస్ నుండి తిరిగి వచ్చిన సందర్భంగా, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి మరియు Read more

ఏపీలో యువత కు ఉపాధి అవకాశాలు
ఏపీలో యువత కు ఉపాధి అవకాశాలు

ఏపీ ప్రభుత్వం వర్క్ ఫ్రం హోం పథకం: అమలు దిశగా కీలక సర్వే ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కసరత్తు మొదలుపెట్టింది. Read more

నేడు ఏపీ కేబినెట్ సమావేశం
AP Cabinet meeting today

అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో కేబినేట్ సమావేశం జరుగనుంది. 3 ఉచిత సిలిండర్ల పథకంపై ఈ కేబినెట్‌లో చర్చ సాగనుంది. ముఖ్యంగా వరద ప్రభావిత Read more

స్కూల్ యూనిఫామ్ విషయంలో ఏపీ కీలక నిర్ణయం
AP cm chandrababu school un

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్ధుల యూనిఫామ్ విషయంలో ఒక కొత్త మార్పును తీసుకురావాలని నిర్ణయించింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను మరింత మెరుగ్గా రూపొందించేందుకు ఈ చర్యలకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *