Headlines
sandhya theatre

సంధ్య థియేటర్‌ యాజమాన్యం ఆన్సర్.

ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన దుర్ఘటనలో రేవతి అనే మహిళ మరణించిన విషయం అందరికీ తెలిసిందే.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.బాధిత కుటుంబానికి ప్రోత్సాహం కల్పించేందుకు హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం ప్రకటించారు. తొక్కిసలాట ఘటనపై సంధ్య థియేటర్ యాజమాన్యానికి పోలీసులు నోటీసులు పంపారు.థియేటర్ యాజమాన్యం ఈ నోటీసులకు పూర్తి వివరణతో సమాధానం ఇచ్చింది.మొత్తం ఆరు పేజీల లేఖను పంపిన థియేటర్ యాజమాన్యం, “సంధ్య థియేటర్‌కు అన్ని అనుమతులు ఉన్నాయి.డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో కోసం 80 మంది సిబ్బందిని విధుల్లో ఉంచాం. గత 45 ఏళ్లుగా థియేటర్ నడుస్తోంది,ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు” అని పేర్కొంది. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సంధ్య థియేటర్‌లో ప్రదర్శితమైంది.ఈ షో చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.

sandhya theater
sandhya theater

అయితే క్రమం తప్పిన జనసందోహం కారణంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి మరణించగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. దుర్ఘటన తర్వాత బాధిత కుటుంబానికి సాయం అందించేందుకు మైత్రీ మూవీ మేకర్స్, హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ముందుకు వచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షలు అల్లు అర్జున్ రూ. కోటి సుకుమార్ రూ.50 లక్షలు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రూ.25 లక్షలు అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. అయితే ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన ఈ దుర్ఘటన సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Faqs zum thema wellensittich käfig einrichten. Jakim producentem suplementów diety jest ioc ?. Advantages of local domestic helper.