తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సినీ పరిశ్రమ ప్రముఖులతో చేసిన సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్‌కు పూర్తి మద్దతు వ్యక్తం చేశారు. శాంతిభద్రతల విషయంలో రాజీ లేదని స్పష్టం చేసిన రేవంత్, సంధ్య థియేటర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం మరింత సీరియస్‌గా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం, ఇకపై బెనిఫిట్ షోలు ఉండబోమని’తేల్చి చెప్పారు. ప్రజల భద్రతా భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. శాంతిభద్రతలు, బౌన్సర్లపై నియంత్రణ మరింత కఠినంగా ఉండబోతుందని చెప్పారు. ప్రజా ప్రభుత్వమైన తాము ప్రజల ప్రయోజనాల కోసం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సినీ పరిశ్రమలో రాజకీయ జోక్యం ఉండకూడదు’అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్’లో బిజినెస్ మోడల్‌ను ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నారు.హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్‌గా మార్చాలని టాలీవుడ్ ప్రముఖులు ఆవేశంగా కోరారు.
సురేష్‌బాబు, త్రివిక్రమ్, నాగార్జున వంటి ప్రముఖులు హైదరాబాద్ నేపథ్యంలో తెలుగు సినిమా ఆగకుండా వృద్ధిచెందాలనుకుంటున్నారు అని వారు చెప్పారు.డీజీపీ జితేందర్, ప్రజల భద్రత ముఖ్యమని అన్నారు. షోల పరంగా అనుమతులు తీసుకున్నప్పుడు, షరతులు పాటించడం అవసరం అని సూచించారు. అలాగే, బౌన్సర్ల ప్రవర్తనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చట్టపరమైన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, సంద్య థియేటర్ ఘటన మళ్ళీ జరగకుండా చూస్తాం అని చెప్పారు. హైదరాబాద్‌ను వరల్డ్ షూటింగ్ డెస్టినేషన్‌గా మార్చడంలో ప్రభుత్వం సహకరిస్తాం అన్నారు. మురళీమోహన్, సినిమా ప్రమోషన్లలో కాంపిటీషన్ వల్ల ప్రాముఖ్యత వస్తుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి, కాబట్టి ప్రమోషన్‌ను విస్తృతంగా చేయాలని’’ ఆయన చెప్పారు.రాఘవేంద్రరావు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో చేయాలని కోరారు. హైదరాబాద్‌లో యూనివర్సల్ లెవెల్‌లో స్టూడియో సెటప్ ఉండాలన్నం అన్నారు.