తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేని కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఆర్ సీ 16 (వర్కింగ్ టైటిల్) సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా కనిపిస్తున్నారు.2024లో విడుదలైన ‘భైరతి రణగల్’ కూడా ఎంతో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో శివన్న అదరగొట్టాడు.నవంబర్ 15న థియేటర్లలో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్గా మారిన ఈ సినిమా, తెలుగులో నవంబర్ 30న విడుదలయ్యాక మంచి వసూళ్లను సాధించింది. అంతే కాదు, ఈ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. క్రిస్మస్ కానుకగా, 2023 డిసెంబర్ 25న అర్ధరాత్రి నుంచి శివన్న సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మొదట ఈ సినిమా కన్నడతో పాటు తెలుగులోనూ విడుదలయ్యే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం, కేవలం కన్నడ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.తెలుగు వెర్షన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. భైరతి రణగల్ సినిమా, నర్తన్ దర్శకత్వంలో తెరకెక్కింది.
ఇందులో శివరాజ్ కుమార్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించారు. 2017లో వచ్చిన మఫ్తీ సినిమా పీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది.శివరాజ్ కుమార్ మరియు నర్తన్ కాంబినేషన్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.అందరూ ఊహించినట్లుగా,ఈ సినిమా శివన్న అభిమానులను ఎంతగానో అలరించింది.గీతా పిక్చర్స్ బ్యానర్‌పై శివరాజ్ కుమార్ భార్య గీతా శివరాజ్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు.ఈ సినిమా మంచి వసూళ్లు తెచ్చుకోవడంతో బ్యానర్‌కు లాభాలు వచ్చాయి.ప్రస్తుతం ఓటీటీలో ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులు మంచి స్పందన ఇస్తున్నారు.అయితే,ఈ సినిమా పనులు పూర్తయిన వెంటనే శివరాజ్ కుమార్ విదేశాలకు వెళ్లాలని నిర్ణయించారు.అనారోగ్య కారణంగా,ప్రస్తుతం ఆయన అమెరికాలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల శివన్నకు శస్త్రచికిత్స జరగ్గా,వైద్యులు,కుటుంబ సభ్యులు విజయవంతమైన శస్త్రచికిత్స విషయాన్ని వెల్లడించారు.