srikakulam accident

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం

కంచిలి మండలం పెద్ద కొజ్జియా జంక్షన్ సమీప జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జైలో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని అతివేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలో ముగ్గురు మృతి చెందగా… మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ నుంచి జాజ్పూర్ దుర్గామాత ఆలయ దర్శనానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

మృతుల వివరాలు: కదిరిశెట్టి సోమేశ్వరరావు(48) ఎం లావణ్య(43), స్నేహగుప్తా(18) దుర్మరణం పాలయ్యారు. విశాఖపట్నం సీతమ్మధార నుండి ఒరిస్సాలోని జాజిపూర్ అమ్మవారి దర్శనానికి వెళుతుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Discover unique and captivating prints. Innovative pi network lösungen. ”“we need to sense the risk of tragedy to ensure we avoid it,” he said.