krt

బహుభాషా కోవిదుడు పీవీ నరసింహా రావు: కేటీఆర్‌

ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహా రావు అని కేటీఆర్‌ అన్నారు.
భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు వర్ధంతి సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఘనంగా నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలతో భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణమని చెప్పారు. గడ్డు కాలంలో దేశానికి ప్రధానిగా సేవలందించిన పీవీ.. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడారని, తన పాలనతో ఆధునిక భారతానికి బాటలు వేశారని తెలిపారు.
పీవీకి సముచితస్థానం ఇచ్చిన బీఆర్ఎస్
రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహా రావు గారిని బీఆర్ఎస్ ప్రభుత్వం సముచితంగా గౌరవించిందని వెల్లడించారు. పీవీ నరసింహా రావు శత జయంతి ఉత్సవాలను కేసీఆర్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందని గుర్తుచేశారు.

నెక్లెస్ రోడ్‌కి పీవీ మార్గ్ అని పేరు పెట్టిందని, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిందన్నారు. వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టిందని చెప్పారు. అంతే కాదు.. పీవీ నరసింహా రావుకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపించిందని తెలిపారు. వారి కూతురిని ఎమ్మెల్సీగా గౌరవించిందన్నారు. భారతరత్న పీవీ.. తెలంగాణ ఠీవి అని ఎక్స్‌ వేదిగా ట్వీట్‌ చేశారు.

Related Posts
అశోక్‌ నగర్‌లో ఉద్రిక్తత..కేంద్ర మంత్రి బండి సంజయ్ అరెస్ట్..!
Bandi sanjay protest at ashok nagar after meet group 1 aspirants 1

హైదరాబాద్‌: హైదరాబాద్‌ అశోక్‌ నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్‌-1 అభ్యర్థుల ఆందోళనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్‌ మద్దతు పలికారు. వారిని పరామర్శించి.. Read more

పీసీసీ చీఫ్‌ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు
MLC candidates meet PCC chief

హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు మంగళవారం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిశారు. కాంగ్రెస్ అభ్యర్థులు విజయశాంతి, అద్దంకి Read more

పోసాని కృష్ణ మురళి అరెస్ట్
పోసానిపై పలు స్టేషన్లలో 30 కి పైగా ఫిర్యాదులు

తెలుగు సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాయదుర్గంలోని మై హోమ్ భుజా అపార్ట్మెంట్‌లో అరెస్ట్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా Read more

ఫిబ్రవరి 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
ఫిబ్రవరి 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఫిబ్రవరి 5న జరగనుంది. ఈ సమావేశంలో కుల గణన మరియు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గీకరణపై చర్చించనున్నారు. కేబినెట్ సమావేశం అనంతరం Read more