ఓటీటీల్లో థ్రిల్లర్ చిత్రాల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది.ఈ జానర్లో ఉండే ట్విస్టులు, సస్పెన్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటాయి. ఈ ఏడాది వివిధ భాషల్లో వచ్చిన థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను బాగా మెప్పించాయి.భారీ వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో నిలిచాయి. ఇప్పుడు ఈ ఏడాది బాగా దుమ్మురేపిన టాప్-10 థ్రిల్లర్ చిత్రాల గురించి తెలుసుకుందాం.తమిళ స్టార్ విజయ్ సేతుపతి నటించిన మహారాజా థియేటర్లలో ఘనవిజయం సాధించింది. జూన్ 14న విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ జూలై 12న నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది.ఈ సినిమా అనేక వారాలపాటు గ్లోబల్‌గా ట్రెండింగ్‌లో నిలిచింది. దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.విక్రాంత్ మాసే ప్రధాన పాత్రలో నటించిన సెక్టార్ 36 సెప్టెంబర్ 13న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.
ఈ క్రైమ్ థ్రిల్లర్ మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఆదిత్య నంబల్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రారంభం నుంచి భారీ వ్యూస్ అందుకుంది.లక్ష్య, రాఘవ్ జుయాల్, తాన్య లీడ్ రోల్స్ చేసిన కిల్ సెప్టెంబర్ 6న డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.ఆరంభం నుంచి మంచి హైప్‌తో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ ట్రెండింగ్‌లో నిలిచింది. విశ్వక్ సేన్ నటించిన గామి ఈ ఏడాది మార్చి 8న థియేటర్లలో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఏప్రిల్ 12న జీ5లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.తొలి రోజుల్లోనే గామి నేషనల్ వైడ్ ట్రెండ్‌గా మారింది.మలయాళంలో వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలై రూ.200 కోట్ల కలెక్షన్లను సాధించింది.మే 5న డిస్నీ+ హాట్స్టార్లోకి వచ్చిన ఈ చిత్రం కూడా ఓటీటీలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.స్పై థ్రిల్లర్ బెర్లిన్ లో అపర్షక్తి ఖురానా,ఇష్వాక్ సింగ్ లీడ్ రోల్స్ చేశారు. సెప్టెంబర్ 13న జీ5లో విడుదలైన ఈ చిత్రం బధిర గూఢచారి కథనంతో సస్పెన్స్‌ను పీక్కు చేర్చింది. మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అన్వేషిప్పిన్ కండేతుమ్ మార్చి 8న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.