Health Minister Damodara Rajanarsimha

ఆరోగ్యశాఖ మంత్రి కీలక ప్రకటన

హైదరాబాద్‌: ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ కీలక ప్రకటన చేశారు. క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం మొబైల్ స్క్రీనింగ్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. అలాగే, రీజనల్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ హాస్పిటళ్లకు ప్రజలే యజమానులు అని మంత్రి వ్యాఖ్యానించారు‌. హైదరాబాద్‌తో పాటు, జిల్లాల్లోనూ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే హైదరాబాద్‌‌లో సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న కొంతమంది సీనియర్ డాక్టర్లను జిల్లాలకు ట్రాన్స్‌ఫర్ చేశామన్నారు.

రాబోయే రోజుల్లో 90 శాతం ట్రీట్‌మెంట్ జిల్లాల్లోనే అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి కొడంగల్ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు కూడా ప్రారంభిస్తున్నామన్నారు. ఆరోగ్యరంగానికి సంబంధించి శాసన మండలిలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

ఈ ఏడాది 8 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించామని మంత్రి గుర్తు చేశారు. ఒక్కో కాలేజీలో 50 సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. అన్ని కాలేజీల్లో ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా ఫాకల్టీని నియమించామన్నారు. అన్ని హాస్పిటల్స్‌లో కలిపి 2500లకు పైగా డయాగ్నస్టిక్స్ యంత్రాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ యంత్రాల మెయింటనన్స్, రిపేర్లకు స్పెషల్ సెల్స్ ఏర్పాటు చేశామన్నారు. అవసరాన్ని బట్టి అవసరమైన చోట ఎంఆర్‌ఐ స్కానింగ్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. యంత్రాలు నడిపేందుకు అవసరమైన హెచ్‌ఆర్‌ను కూడా రిక్రూట్ చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rapat paripurna dprd kota batam, pemerintah kota batam ajukan 8 poin ranperda. Valley of dry bones. England test cricket archives | swiftsportx.