Rahul Gandhi met MPs

ఎంపీలతో రాహుల్ గాంధీ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లోక్ సభలో అనుసరించ వలసిన వ్యూహంపై ప్రతిపక్షాలు సమాయత్తమయ్యాయి. అందులో భాగంగా గురువారం ఉదయం ఢిల్లీలోని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి హాజరైన ఎంపీలతో రాహుల్ గాంధీ చర్చిస్తున్నారు. అయితే అంబేద్కర్ విగ్రహం నుంచి పార్లమెంట్ మకర్ ద్వార్ వరకు మార్చ్ నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

కాగా, రాజ్యాంగంపై చర్చ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా రెండు రోజుల క్రితం రాజ్యసభలో ప్రసంగిస్తూ.. అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్.. అని ఇన్ని సార్లు భగవంతుడి పేరు తలచుకొంటే ఏడేడు జన్మలు వారికి స్వర్గంలో స్థానం లభించేదన్నారు. అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. హోం మంత్రిగా అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. అమిత్ షా వ్యాఖ్యలను ప్రధాని మోడీ సమర్థించే ప్రయత్నం చేశారు.

రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అవమానించిందో హోం మంత్రి అమిత్ షా వెల్లడించారంటూ ప్రధాని మోడీ.. తన ఎక్స్ వేదికగా వరుసగా వివరించారు. అందుకే హోం మంత్రి చెప్పిన వాస్తవాలు చూసి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఉల్కిపడిందన్నారు. అందులోభాగంగానే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసలు విషయాలు ప్రజలకు తెలుసునని ఈ సందర్భంగా మోడీ తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gelar rapat paripurna, ini 10 rancangan randerda inisiatif dprd kota batam. Un реасеkеереrѕ іn lebanon ѕау iѕrаеl hаѕ fіrеd on thеіr bаѕеѕ deliberately. Latest sport news.