లోన్ యాప్ వేధింపులు.. యువకుడి ఆత్మహత్య
మెదక్ : మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాలలో విషాదం నెలకొంది. లోన్ యాప్ ద్వారా మిషన్ భగీరథ కార్మికుడు గంగాధర్ (28)రూ.3 లక్షలు తీసుకున్నాడు. ఈఎంఐలు సక్రమంగా చెల్లించలేకపోవడంతో లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు ఎక్కువయ్యాయి. దీనితో మనస్తాపం గురై పురుగు మందు తాగి గంగాధర్ ఆత్మహత్య చేసుకున్నాడు.