bengaluru

బెంగళూరులో పొడవైన యూ-గర్డర్ ఆవిష్కరణ!

దేశంలోనే అతిపొడవైన యూ-గర్డర్ (సిమెంట్ దూలం)ను బెంగళూరులోని సబర్బన్ రైల్ కారిడార్‌లో ఉపయోగించారు. బెంగళూరు సబర్బన్ రైల్వే ప్రాజెక్టులో భాగంగా 31 మీటర్ల పొడవైన ఈ గర్డర్‌ను ఈ ఏడాది జనవరిలో గొల్లహళ్లిలో ఒకే విడతలో ప్రీకాస్ట్ చేయడం విశేషం. బైయప్పనళ్లి-చిక్కబనవర లైన్‌లో యశ్వంతపూర్‌లో గత రాత్రి 9.45-10 గంటల మధ్య ఆవిష్కరించినట్టు ‘కే-రైడ్’ (కర్ణాటక రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కంపెనీ లిమిటెడ్) అధికారులు తెలిపారు.
యూ’ ఆకారంలో గర్డర్‌
‘యూ’ ఆకారంలో ఉన్న ఈ గర్డర్‌లను రైల్వే ఆధారిత ప్రజారవాణా ప్రాజెక్టులలో ఉపయోగిస్తుంటారు. హెబ్బాల్-యశ్వంతపూర్ మధ్య మల్లిగే లైన్ 8 కిలోమీటర్ల ఎలివేటెడ్ సెక్షన్‌లో 450 యూ-గర్డర్‌లు ఉపయోగిస్తున్నారు. గొల్లహళ్లి వద్ద ఇప్పటికే 60 యూ గర్డర్లు వేశారు. కాగా, మల్లిగే లైన్‌ను డిసెంబర్ 2026 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇవి నాణ్యంగా ఉండటంతోపాటు నిర్మాణ సమయాన్ని ఆదా చేస్తాయి. మెట్రో ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు గరిష్ఠంగా 28 మీటర్ల యూ గర్డర్లను మాత్రమే ఉపయోగించారు. యూ గర్డర్‌కు 69.5 క్యూబిక్ మీటర్ల ఎం60 గ్రేడ్ కాంక్రీట్ అవసరం అవుతుంది. బరువు ఏకంగా 178 టన్నులు ఉంటుంది.

Related Posts
మారిష‌స్‌ చేరుకున్న ప్ర‌ధాని మోడీ
Prime Minister Modi arrives in Mauritius

న్యూఢిల్లీ: ప్ర‌ధాని మోడీ రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈరోజు మారిష‌స్ చేరుకున్నారు. ఈ నేప‌థ్యంలో పోర్టు లూయిస్ విమానాశ్ర‌యంలో ఆయ‌నకు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. మారిష‌స్‌లో Read more

రేపు లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లు
jamili elections

దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలకమైన బిల్లును కేంద్ర ప్రభుత్వం రేపు లోక్సభలో ప్రవేశపెట్టనున్నది. ఈ బిల్లు ద్వారా పార్లమెంటు ఎన్నికలు మరియు రాష్ట్ర అసెంబ్లీ Read more

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ
Maoist Bade Chokka Rao amon

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్‌ లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా బలగాలు నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో తెలంగాణ మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ బడే Read more

ఢిల్లీ కొత్త సీఎం ప్ర‌మాణం స్వీకారానికి టైం ఫిక్స్
NKV BJP

ఢిల్లీలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేడుకకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22వ తేదీ గురువారం సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఈ Read more