రష్మిక మందన్న తన తెలివైన సమాధానాలతో మరోసారి అందరి మనసు దోచుకుంది.తాజాగా ‘పుష్ప 2: ది రూల్’ సినిమాలో ఆమె శ్రీవల్లి పాత్రకు మంచి స్పందన వస్తోంది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తూ, పుష్ప రాజ్-శ్రీవల్లి జోడీని ప్రేక్షకులు ఆకాశానికెత్తేస్తున్నారు.ఇదిలా ఉండగా, విజయ్ దేవరకొండతో రష్మిక ప్రేమలో ఉందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలలో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండను ప్రత్యేకంగా చెప్పాల్సిందే.అల్లు అర్జున్ పాన్-ఇండియా స్థాయిలో ‘పుష్ప’ సినిమాతో తన స్థాయిని మరింతగా పెంచుకున్నారు. ఇక విజయ్ దేవరకొండ అయితే తక్కువ కాలంలోనే టాలీవుడ్ రౌడీ బాయ్‌గా మంచి గుర్తింపు పొందాడు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్.బన్నీ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు విజయ్ స్వయంగా ఇంటికి వెళ్లి అతనిని కలిశాడు.వీరిద్దరి మధ్య నటన, స్టైల్ పరంగా కొన్ని పోలికలు ఉండటంతో వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది.ఇటీవల, ఓ అభిమాని రష్మికను “అల్లు అర్జున్ లేదా విజయ్ దేవరకొండ? ఇద్దరిలో ఎవరు బెస్ట్?” అని ప్రశ్నించాడు.దీనికి రష్మిక తనదైన శైలిలో సమాధానమిచ్చింది. రష్మిక మాట్లాడుతూ, “విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’వంటి సూపర్ హిట్ ఇచ్చాడు. అల్లు అర్జున్ ‘పుష్ప’తో నిజంగా వండర్ క్రియేట్ చేశాడు.వీరిద్దరూ తమతమ సినిమాలతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వాళ్లిద్దరూ అత్యుత్తమ నటులు. నేను,వాళ్ల ట్యాలెంట్ గురించి మాట్లాడే అర్హత కలిగిన వ్యక్తిని కాదు. ఎవరి ప్రతిభను ఎవరు మించిపోతారో చెప్పడం సులభం కాదు. కానీ వారు ఇద్దరూ తమ ప్రత్యేకతలతో ఇండస్ట్రీలో తారస్థాయికి ఎదిగారు,” అని చెప్పింది. ఈ సమాధానం రష్మిక తీరును, ఆమె తెలివైన సమర్పణ శైలిని మరోసారి రుజువు చేసింది. ఆమె ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి మరో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తుండటంతో, వీరి జోడీని ప్రేక్షకులు చేస్తుండటం విశేషం.