anushka shetty

బిల్లాలో నా డ్రసింగ్ చూసి మా అమ్మ చెప్పిన మాట విని షాక్ అయ్యా..

తెలుగు సినీ ఇండస్ట్రీలో అనుష్క శెట్టి అనేది ఓ ప్రత్యేక పేరు. బాహుబలి సినిమా తరువాత ఆమె సినిమాల సంఖ్య కొంత తగ్గింది. కానీ ఇప్పుడు, ఆమె కొత్త ప్రాజెక్ట్ ఘాటీ తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది.ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇందులో అనుష్క ఒక ప్రత్యేకమైన రోల్ లో కనిపించనుంది.ప్రభాస్ గురించి చెప్పాలంటే, ప్రస్తుతం అతను వరుస విజయాలతో అగ్రగామి స్థాయికి చేరుకున్నాడు.సలార్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కి పెద్ద ఊరట కలిగించింది.దాదాపు ఆరేళ్ల తరువాత ప్రభాస్ ఎలాంటి హిట్ సినిమా ఇచ్చాడు.ఇక,కల్కి సినిమా కూడా 1000 కోట్ల వసూళ్లు సాధించి మరో సంచలనాన్ని సృష్టించింది. ప్రభాస్ నటించిన సినిమాలలో బిల్లా సినిమా మరచిపోలేనిది.మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1978 హిందీ చిత్రమైన డాన్ కి రీమేక్ గా రూపొందింది.ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.ఈ సినిమాలో అనుష్క కూడా ముఖ్య పాత్రలో నటించింది.

ఆమె బికినీ లో కనిపించి ప్రేక్షకులను షాక్ కి గురిచేసింది. ఇప్పుడికీ, బిల్లా సినిమాతో అనుష్క చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజానికి, అనుష్కకు బోల్డ్ గా కనిపించడం అంతగా ఇష్టం లేదట.సినిమాల్లోకి రాకముందు ఆమె సాధారణంగా సల్వార్ కమీజ్‌లు మాత్రమే ధరించేదీ.కానీ బిల్లా సినిమాతో ఆమె తన స్టైల్‌ను మార్చుకుంది. ఆ సమయంలో అనుష్క తల్లి కూడా,”పద్ధతిగా ఉండాలి కానీ కొంచెం స్టైలిష్ గా ఉండొచ్చు” అని చెప్పడంతో, ఆమె కాస్త షాక్ అవుతుందని పేర్కొంది.ప్రస్తుతం అనుష్క ఆచితూచి సినిమాలు చేస్తోంది.మిస్ శెట్టి.మిస్టర్ పోలిశెట్టి సినిమాతో హిట్ కొట్టిన ఆమె,త్వరలోనే ఘాటీ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.ఈ కొత్త సినిమా కోసం ప్రేక్షకుల అంచనాలు భారీగా పెరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gelar rapat paripurna, ini 10 rancangan randerda inisiatif dprd kota batam. Valley of dry bones. Swiftsportx | to help you to predict better.