vishwambhara

ఇకపై చూస్తారుగా చిరు చిందించే రక్తం అంటూ..

చిరంజీవి అంటేనే మాస్.ఊర మాస్! అయితే, ఇటీవలి కాలంలో మెగాస్టార్ మాస్ యాంగిల్ కనిపించడంలేదు అని భావిస్తున్న ఫ్యాన్స్ కొంతకాలంగా బాధపడుతున్నారు.వారంతా చిరంజీవి తన వింటేజ్ మాస్ తరహాలో కనిపించడం లేదని ఆలోచిస్తున్నారు. ఇదే సమయంలో, చిరంజీవి ఈ ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకొని,”ఇప్పుడు చూతాం, మళ్ళీ నేను మాస్‌తో తిరిగి వస్తాను” అంటూ ఓ రక్త ప్రమాణం చేసారు.మాస్ అంటే, 90ల నుంచి 2000ల మధ్యలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. ఆ సమయంలో ఆయన సినిమాలు మాస్ ఆడియెన్స్ కోసం రూపొందించబడిన ఎంటర్టైనర్‌లుగా ఉండేవి. కానీ,రీ-ఎంట్రీ తర్వాత చిరంజీవి చూపించిన ఖైదీ నం.150, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలు పెద్ద హిట్స్ అయ్యాయి,అయితే కొన్ని సినిమాలు అంచనాల మేరకు మంచి ఫలితాలు ఇవ్వలేకపోయాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఫ్యాన్స్ కొంత బాధపడుతూ, చిరంజీవి నుండి మాస్ ఎలిమెంట్‌ను మరింతగా ఆశిస్తున్నారు.

ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర అనే సినిమాతో షూటింగ్ చేస్తున్నాడు, ఇది ఒక విజువల్ వండర్. ఆ తరువాత, అనిల్ రావిపూడితో ఓ సినిమా కూడా సైన్ చేశాడు.ఈ సినిమా యాక్షన్, కామెడీ కలబోసిన ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. కానీ,ఈ సినిమాల్లో కూడా పూర్తిగా మాస్ ఎలిమెంట్ చూపించడం లేదు. అయితే, చిరంజీవి ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక కొత్త సినిమా సైన్ చేశాడు.ఈ సినిమాకు నాని సమర్పకుడిగా ఉండటం కూడా ఒక ప్రత్యేక అంశం. ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయంపై మరింత ఆసక్తి పెరిగింది. శ్రీకాంత్ ఓదెల చిరంజీవికి “మాస్” యాంగిల్‌ను తిరిగి తీసుకురావడానికి ప్రతిజ్ఞ చేసారు.నాని కూడా ఈ ప్రాజెక్టును పెద్దగా ప్రమోట్ చేస్తూ “ఫ్యాన్ బాయ్ తాండవం”అంటూ పోస్ట్ చేశారు.ఈ స్థితిలో,చిరంజీవి తన అభిమానుల ఆశలను సాకారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు.పాత మాస్ మెగాస్టార్‌ను తిరిగి తెచ్చేందుకు ఈ సినిమా ఒక మంచి అవకాశం కావచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Dprd kota batam. But іѕ іt juѕt an асt ?. Latest sport news.