og movie

బాబాయ్‌ అబ్బాయి కలిసి నటిస్తారా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్‌లో ఉన్న అతి ప్రతిష్టాత్మక సినిమాల్లో ‘ఓజీ’ ప్రత్యేకంగా నిలుస్తోంది.ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌లో బిజీగా ఉన్న పవన్, త్వరలోనే ‘ఓజీ’ పనులను వేగంగా మొదలుపెట్టబోతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన అనేక విశేషాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.‘ఓజీ’ సినిమా ముంబై మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా.ఇందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు.ఇప్పటికే కొంతమేర షూటింగ్ పూర్తయింది, మరియు ఇటీవల ఈ ప్రాజెక్ట్ తిరిగి ప్రారంభమైంది. త్వరలో పవన్ కూడా షూటింగ్‌లో జాయిన్ కానున్నారని యూనిట్ సమాచారం.ఇటీవలే ‘ఓజీ’లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్ చేయబోతున్నారని వార్తలు వైరల్ అయ్యాయి.ఈ చిత్ర దర్శకుడు సుజిత్ గతంలో ప్రభాస్‌తో ‘సాహో’ చిత్రాన్ని రూపొందించారు.ఉత్తర భారతదేశంలో ఆ సినిమా భారీ హిట్ కావడం, ప్రభాస్‌తో సుజిత్ మంచి అనుబంధం ఉండటంతో ఈ వార్తలపై బలమైన చర్చలు సాగుతున్నాయి.పవన్ కుమారుడు అకీరా నందన్ కూడా ‘ఓజీ’తో తన సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనున్నారని బలమైన ప్రచారం జరిగింది.

సినిమాలో అతనికి కీలకమైన పాత్ర ఉండబోతుందని, ఆ సీన్లు హైలైట్‌గా నిలుస్తాయని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు.అయితే ఈ వార్తలపై ఇంకా చిత్రబృందం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.ఇప్పుడు మరో ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.పవన్, చరణ్ మధ్య ఉన్న అనుబంధం గురించి అభిమానులకు బాగా తెలుసు.ఈ కాంబినేషన్ తెరపై చూడాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.‘ఓజీ’తో ఆ కోరిక తీరబోతోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.ఈ వార్తలు ఎంతగా వైరల్ అయినా, ‘ఓజీ’ చిత్రయూనిట్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.అభిమానుల్లో మాత్రం ఈ ఊహాగానాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gelar rapat paripurna, ini 10 rancangan randerda inisiatif dprd kota batam. Valley of dry bones. Latest sport news.