हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

పార్టీ పదవికి శివసేన ఎమ్మెల్యే రాజీనామా

Vanipushpa
పార్టీ పదవికి శివసేన ఎమ్మెల్యే రాజీనామా

మహరాష్ట్రలో బీజేపీ కూటమి గెలుపు పొందినప్పటినుంచి సీఎం, మంత్రి పదవుల పై కసరత్తులు జరుగుతున్నా, ఇంకా అక్కడ దీనిపై స్పష్టత రావడం లేదు. తాజాగా మంత్రి పదవిని ఆశించి భంగపడిన శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) ఎమ్మెల్యే నరేంద్ర భోండేకర్ పార్టీ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన పార్టీ డిప్యూటీ నేతగా, విదర్భ కోఆర్డినేటర్‌గా ఉన్నారు. భండారా-పావని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన పార్టీ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపు
మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయనకు మంత్రి పదవిని ఇస్తామని పార్టీ హామీ ఇచ్చింది. అయితే, నిన్న జరిగిన కేబినెట్ విస్తరణలో ఆయనకు చోటు దక్కలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆయన పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఏక్‌నాథ్ షిండే, ఉదయ్ సామంత్, ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండేకు మెసేజ్ పంపారు.
దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఉదయ్ సామంత్‌కు మంత్రి పదవి దక్కింది. మొత్తం 39 మంది నిన్న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 19 మంది బీజేపీ నేతలు కాగా, 11 మంది శివసేన, 9 మంది ఎన్సీపీ నేతలు ఉన్నారు. ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలతో కలుపుకొంటే కేబినెట్ బెర్త్‌ల సంఖ్య 42కు చేరింది.  

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870