mahadharna-postponed-in-nallagonda

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన

హైదరాబాద్‌: ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమైన కాసేపటికే బీఆర్ఎస్ నేతలు లగచర్ల ఘటనపై వాయిదా తీర్మానం కోరడంతో పాటు తాజాగా అసెంబ్లీ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. లగచర్ల రైతుకు బేడీలు వేసి వైద్య పరీక్షలకు తీసుకెళ్లడం పట్ల విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్లకార్డులతో సభలోకి వెళ్లేందుకు గులాబీ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. దీంతో మార్షల్స్ వారిని అడ్డుకోగా కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Advertisements

అనంతరం పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. బీఏసీలో చర్చించకుండానే అసెంబ్లీ ఎజెండా ఖరారు చేయడం దారుణమన్నారు.టూరిజం మీద చర్చించాల్సిన సమయం ఇది కాదని.. లగచర్ల రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడంపై సభలో చర్చించాలని డిమాండ్ చేశారు. నెల రోజులు జైల్లో వేసేంత తప్పు ఆ రైతులు ఏం చేశారని ప్రశ్నించారు. రైతుకు గుండెపోటు వస్తే బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లిన సర్కార్..యావత్ తెలంగాణ రైతులను అవమానించిందని హుజురాబాద్ ఎమ్మెల్యే మండిపడ్డారు. కాగా, ఈ నెల 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ, సోమవారం వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే.

Related Posts
కల్తీ నెయ్యి కేసు నిందితులకు మరోసారి కస్టడీ
tirumlala ghee

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పొమిల్ జైన్, అపూర్వ చావడాలకు Read more

భగవద్గీత మీద ప్రమాణం చేసిన కాష్‌ పటేల్
Kash Patel took oath on Bhagavad Gita as FBI director

భారతీయ మూలాలు మరిచిపోలేదంటూ ప్రశంసలు వాషింగ్టన్: అమెరికా 9వ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ప్రవాస భారతీయుడు కాష్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల అమెరికా ఫెడరల్ బ్యూరో Read more

KTR: ప్రభుత్వం తీరుపై విమర్శించినా కేటీఆర్‌
KTR: ప్రభుత్వం తీరుపై విమర్శించినా కేటీఆర్‌

కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇసుక Read more

5 లక్షలతో పట్టుబడిన..సీఎం కార్యాలయ ఉద్యోగులు..ఢిల్లీ
5 లక్షలతో పట్టుబడిన..సీఎం కార్యాలయ ఉద్యోగులు..ఢిల్లీ

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు రూ. 5 లక్షల నగదుతో పట్టుబడ్డారు Read more

×