Bomb threats to Delhi schools again

మళ్లీ ఢిల్లీ పాఠశాలలకు బాంబు బెదిరింపులు

న్యూఢిల్లీ: మరోసారి దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. శుక్రవారం దాదాపు 30 పాఠశాలలకు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం ఉదయం కూడా పలు స్కూళ్లకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఆర్కేపురం, వసంత్‌ కుంజ్‌ ప్రాంతాల్లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్ సహా పలు పాఠశాలలు బెదిరింపులు వచ్చాయి. శనివారం ఉదయం 6:12 గంటల ప్రాంతంలో బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఆయా పాఠశాలల యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు పాఠశాలల వద్దకు చేరుకొని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో పాఠశాలల ఆవరణల్లో తనిఖీలు చేశారు. అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ లభించలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, సూళ్లలో బాంబులు ఉన్నాయంటూ బెదిరింపులు రావడంతో ఈ వారంలో ఇది మూడోసారి కావడం గమనార్హం. వరుస బెదిరింపులతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

కాగా, (డిసెంబరు 9న) కూడా 40కి పైగా స్కూళ్లకు ఈ తరహా బెదిరింపులే వచ్చాయి. పాఠశాల ఆవరణల్లో పేలుడు పదార్థాలను అమర్చామని, వాటిని పేల్చకుండా ఉండాలంటే 30వేల డాలర్లు ఇవ్వాలని గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించారు. అయితే, అది నకిలీదని ఆ తర్వాతి ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 2024 ఆరంభం నుంచి దిల్లీ, ఇతర ప్రాంతాల్లో పాఠశాలలకు పలుమార్లు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇక, అక్టోబరులో దిల్లీలోని రోహిణి ప్రాంతంలోని ఓ సీఆర్​పీఎఫ్‌ స్కూల్‌ బయట బాంబు పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rapat paripurna dprd kota batam, pemerintah kota batam ajukan 8 poin ranperda. Whаt wіll іt tаkе tо turn the tіdе ?. Latest sport news.