పెరిగిన చలి మైనస్ లో ఉష్ణోగ్రత

winter

డిసెంబర్ మాసం అంటేనే చలి వణికిస్తుంది. అయితే ఇటీవల అల్పపీడన ప్రభావంతో చలిలో తీవ్ర మార్పులు వస్తున్నాయి. ఒక్కసారిగా చలి విపరీతంగా పెరిగింది. దీనికి కారణం హిమాలయాల పశ్చిమ ప్రాంతం మీదుగా వీస్తోన్న గాలుల ప్రభావం వల్ల చలి అమాంతంగా పెరిగినట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో మున్ముందు రాత్రి ఉష్ణోగ్రత మరింత క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజలు ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది. చంటి పిల్లలు, వృద్దులు జాగ్రత్తగా వుండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు .

గత 24 గంటల వ్యవధిలో కనిష్ఠ ఉష్ణోగ్రత పంజాబ్‌లో నమోదైంది. ఇక్కడి ఆదంపూర్‌లో టెంపరేచర్ మైనస్‌లో పడిపోయింది. -0.4గా రికార్డయింది. హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులకు సమీపంలో ఉండే గ్రామం ఇది. దీని తరువాత హర్యానా హిసార్‌లో అత్యల్పంగా 1.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హిమాలయ పర్వత శ్రేణుల మీదుగా వీస్తోన్న చలిగాలులు, అక్కడ కురుస్తోన్న మంచు వర్షం వల్ల చలిగాలుల తీవ్రత ఇక్కడ ఒక్కసారిగా పెరిగింది. రాజస్థాన్‌లోని చురు- 3.1, పంజాబ్ అమృత్‌సర్- 3.8, రాజస్థాన్ పిలానీ- 4.0, ఉత్తరప్రదేశ్ సర్సవా- 4.1, పంజాబ్ హల్వారా ఐఎఎఫ్- 4.1, రాజస్థాన్ ఉత్తర్‌లై ఐఎఎఫ్- 4.2, హర్యానా భివానీ- 4.6 డిగ్రీల సెల్సియస్ మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్- 4.6, రాజస్థాన్ చిత్తోర్‌గఢ్- 4.7, మధ్యప్రదేశ్ ఉమేరియా- 4.8, ఉత్తరప్రదేశ్ బరేలీ- 4.9 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత రికార్డయినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Stuart broad truly stands as a force to be reckoned with in the world of test cricket. But іѕ іt juѕt an асt ?. (ap) — the families of four americans charged in.