ఆర్థిక మంత్రికి మరోసారి అరుదైన గౌరవం

Union Finance Minister Nirmala Sitharaman is once again a rare honour

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మరోసారి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో చోటు సాధించారు. ఫోర్బ్స్‌ ఏటా వ్యాపారం, వినోదం, రాజకీయ, దాతృత్వం తదితర రంగాల నుంచి ప్రభావవంతమైన వ్యక్తుల ర్యాంకింగ్‌లను విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది కూడా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్‌ నుంచి మొత్తం ముగ్గురికి చోటు దక్కింది. అందులో నిర్మలమ్మ తొలి స్థానంలో నిలిచారు. ఇక వరుసగా ఆరో సంవత్సరం ఈ జాబితాలో ఆమె చోటు దక్కించుకోవడం విశేషం.

శక్తిమంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్‌ తొలిసారి 2019లో చోటు దక్కించుకున్నారు. ఆ ఏడాది ఆమెకు 34వ ర్యాంక్‌ దక్కింది. 2020లో 41వ స్థానం, 2021లో 37వ స్థానం సాధించిన ఆమె 2022లో 36వ స్థానం, 2023లో 32వ స్థానంలోనిలిచారు. ఇప్పుడు 28వ స్థానంలో చోటు దక్కించుకోవడం విశేషం. ఏటా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ వస్తున్నారు. ఇక నిర్మలమ్మ తర్వాత ఈ జాబితాలో ప్రముఖ ఐటీ సంస్థల్లో ఒకటైన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ చైర్‌పర్సన్‌, హెచ్‌సీఎల్‌ కార్పొరేషన్‌ సీఈవో అయిన రోష్ని నాడార్‌ మల్హోత్రా 81వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోకాన్‌ లిమిటెడ్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా 82వ స్థానంలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest sport news. It’s just that mоѕt оf the gаіnѕ frоm thаt hаvе gone tо thе top. Today, demonstrators at kent state are asking the university to divest its portfolio of instruments of war.