సంగారెడ్డిలో భారీగా పట్టుబడిన డ్రగ్స్‌

drugs3

డ్రగ్స్ కంట్రోల్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆశించిన ఫలితం రావడం లేదు. తాజాగా సంగారెడ్డిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. న్యూ ఇయర్ దగ్గ రపడుతున్న వేళా డ్రగ్స్ దొరకడం కలకలం సృష్టిస్తున్నది. డ్రగ్స్ ను ఏపీ నుంచి ముంబైకి తరలిస్తున్న సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు అలెర్ట్ అయ్యారు.
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లిలో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. మొగడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
ఈ క్రమంలో ఓ లారీలో డ్రగ్స్‌ను గుర్తించి వాటిని సీజ్‌ చేశారు. వాటి విలువ రూ.50 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఓడరేవు నుంచి వాటిని ముంబైకి తరలిస్తున్నారని తెలుస్తున్నది.
పట్టుబడిన డ్రగ్స్‌ను చిరాగ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా, లారీ డ్రైవర్‌, క్లీనర్‌ పరారైన్లు అధికారులు వెల్లడించారు.ఈ తనిఖీల్లో డీఆర్‌ఐ, నార్కొటిక్‌ డ్రగ్స్‌ కంట్రోల్‌, సెంట్రల్‌ విజిలెన్స్‌ అధికారులు పాల్గొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్‌ను ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు, దీనివెనక ఎవరున్నారనే విషయమై ఆరాతీస్తున్నారు. న్యూ ఇయర్ సందర్బంగా పెద్ద ఎత్తున ఆంధ్ర, తెలంగాణాలో డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు పోలీసులకు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest sport news. But іѕ іt juѕt an асt ?. Russians stage a rare protest after a dam bursts and homes flood near the kazakh border.