దేశవ్యాప్తంగా ప్రశంసల వెల్లువ గుకేశ్ విజయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా అనేక రాజకీయ, క్రీడా ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖులు కూడా గుకేశ్ విజయాన్ని అభినందిస్తూ తమ భావాలు వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తదితరులు సోషల్ మీడియాలో గుకేశ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. చిరంజీవి ట్వీట్ మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్లో గుకేశ్‌ను ఇలా అభినందించారు వావ్ జస్ట్ వావ్ నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది. 18 ఏళ్ల వయస్సులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్ అవడం గొప్ప ఘనత. భారత్ మీ గురించి గర్విస్తోంది. ఇది మా ‘మేరా భారత్ మహాన్’ క్షణం తారక్ ప్రశంసలు జూనియర్ ఎన్టీఆర్ కూడా గుకేశ్ ప్రతిభను ప్రశంసిస్తూ ట్విట్టర్లో ఇలా రాశారు గుకేశ్‌కి గ్రాండ్ సెల్యూట్. మీరు ప్రపంచానికి భారత ప్రతిభను చూపించారు.
మరెన్నో విజయాలను మీ ప్రయాణంలో సాధించాలి.రాజమౌళి అభినందనలు దర్శకధీరుడు రాజమౌళి గుకేశ్ విజయాన్ని ఇలా ప్రశంసించారు అభినందనలు గుకేశ్. ప్రపంచ వేదికపై భారత జెండాను ఎగురవేసి దేశాన్ని గర్వించిపెట్టావు. మీ అద్భుత ప్రతిభకు హృదయపూర్వక శుభాకాంక్షలు.జై హింద్ కమల్ హాసన్ స్పందన ప్రముఖ నటుడు కమల్ హాసన్ గుకేశ్‌ను ప్రత్యేకంగా అభినందిస్తూ తన ట్వీట్లో రాశారు చరిత్రకే చెక్‌మేట్ పడింది ప్రపంచంలో అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్‌గా నిలిచినందుకు గర్వంగా ఉంది. ఆఖరి గేమ్‌లో చూపిన శాంతం, ధైర్యం మిమ్మల్ని ప్రత్యేకంగా నిలిపింది.భారతదేశం మీ విజయంతో వెలుగుతో నిండిపోయింది. గుకేశ్ విజయంతో దేశం గర్వంగా గుకేశ్ సాధించిన ఈ చారిత్రాత్మక విజయం, భారత యువతకు స్ఫూర్తిగా నిలిచింది.ఆయన ప్రతిభ, పట్టుదల,శ్రద్ధ ప్రపంచం మొత్తం గుర్తించింది.భవిష్యత్తులో గుకేశ్ మరింత విజయాలు సాధించాలని భారతదేశం ఆశాభావంతో ఉంది.చెస్‌లో ఈ స్ఫూర్తిదాయక విజయయాత్ర చాలా మందికి ప్రేరణగా నిలుస్తోంది.