హైదరాబాద్ బిర్యానీ మరోసారి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి సాధించింది. ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ టేస్టీ అట్లాస్ ఇటీవల ప్రకటించిన ప్రపంచ అత్యుత్తమ వంటకాల జాబితాలో హైదరాబాద్ బిర్యానీ 31వ స్థానంలో నిలిచింది. ఈ ఘనత భారతీయ వంటకాల ప్రత్యేకతను మరింత చాటిచెబుతోంది. ఈ జాబితాలో మొత్తం 15,478 వంటకాలు పోటీ పడగా, హైదరాబాద్ బిర్యానీ ప్రత్యేకంగా నిలిచింది. బిర్యానీ వంటకానికి వచ్చే రుచి, ఘుమఘుమలు ప్రపంచ వ్యాప్తంగా ఆహార ప్రియుల మనసులను కట్టిపడేసింది. హైదరాబాద్‌కి మాత్రమే ప్రత్యేకమైన ఈ వంటకం స్థానిక మసాలాలు, సుగంధ ద్రవ్యాలతో తయారవుతుంది.
ప్రపంచ అగ్రస్థానంలో కొలంబియాకు చెందిన లెచోనా వంటకం నిలిచింది. ఈ జాబితాలో దక్షిణ భారత వంటకాలకూ మంచి గుర్తింపు లభించింది. హైదరాబాద్‌లోని ITC కోహినూర్ రెస్టారెంట్ ప్రపంచవ్యాప్తంగా దక్షిణ భారత వంటకాలను రుచి చూపించే రెస్టారెంట్లలో మూడో స్థానంలో నిలవడం గర్వకారణం. బిర్యానీ మాత్రమే కాకుండా దక్షిణ భారత వంటకాలు అంతర్జాతీయంగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. టేస్టీ అట్లాస్ వంటి గైడ్‌లు ఈ రకమైన గుర్తింపులు ఇవ్వడం వల్ల భారత వంటకాలకే గౌరవం పెరుగుతోంది. ఇది హైదరాబాద్ బిర్యానీకి ఉన్న ప్రత్యేకతను మరోసారి ప్రపంచానికి పరిచయం చేస్తోంది. హైదరాబాద్ బిర్యానీ సాంప్రదాయ వంటకం మాత్రమే కాకుండా, ఈ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక కూడా. ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం ద్వారా ఈ వంటకం ప్రపంచ వంటక రంగంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. రాబోవు రోజుల్లో బిర్యానీకి మరింత గౌరవం పొందేందుకు ఇది ప్రేరణగా నిలుస్తుంది.