हिन्दी | Epaper
వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

హిందూ ఆలయానికి ముస్లిం భక్తుడి గిప్ట్..

Sudheer
హిందూ ఆలయానికి ముస్లిం భక్తుడి గిప్ట్..

హిందూ ఆలయానికి ముస్లిం భక్తుడు భారీ గిఫ్ట్ అందజేసి వార్తల్లో నిలిచాడు. మనసున్న భక్తుడికి మతం పెద్దది కాదు..అని జహీర్ హుస్సేన్ అనే వ్యక్తి నిరూపించాడు. తమిళనాడులోని తిరుచ్చిలో ప్రసిద్ధమైన శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయానికి విలువైన బహుమతిని అందజేశారు. 600 వజ్రాలతో ప్రత్యేకంగా రూపొందించిన కిరీటాన్ని సమర్పించి.. మత సామరస్యాన్ని చాటుకున్నారు. జహీర్ హుస్సేన్ భరతనాట్య కళాకారుడిగా సుపరిచితుడు. తన నాట్య ప్రదర్శనల ద్వారా సంపాదించిన డబ్బులను దాచుకుని, శ్రీరంగం రంగనాథ స్వామి కోసం ఈ ప్రత్యేకమైన కిరీటాన్ని తయారు చేయించారు. ఈ కిరీటంలో 3169 క్యారెట్ల బరువున్న ఒకే రూబీ రాయి ప్రధాన ఆకర్షణగా ఉంది. ఈ కిరీటాన్ని తయారు చేయడానికి 8 ఏళ్ల సమయం పట్టిందని జహీర్ వెల్లడించారు.

శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు సుందర్ భట్టర్‌కు జహీర్ హుస్సేన్ ఈ కిరీటాన్ని బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జహీర్ హుస్సేన్ తనలో మత పరమైన ఏదైనా తేడాలు లేవని స్పష్టం చేశారు. హిందూ దేవాలయానికి తన ముక్కును చెల్లించడం పట్ల ఎంతో ఆనందంగా ఉన్నట్లు తెలిపారు. జహీర్ హుస్సేన్ చేసిన ఈ పని సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంది. హిందూ-ముస్లిం ఐక్యతకు జహీర్ హుస్సేన్ ఒక ఆదర్శంగా నిలిచారని ప్రశంసలు కురుస్తున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870