శ్రీ మందిర్ యొక్క కార్తీక మహా దీపం వేడుక

Kartika Maha Deepam celebration of Sri Mandir

ఆధ్యాత్మిక మేల్కొలుపు మరియు విముక్తి కోసం అరుణాచలేశ్వర దీపం యొక్క ప్రత్యక్ష దర్శనంతో పవిత్రమైన అరుణాచల తీర్థ శివ పార్వతీ కళ్యాణం మరియు మహా రుద్ర హోమంలో పాల్గొనండి..

హైదరాబాద్‌ : చీకటిపై కాంతి యొక్క శాశ్వతమైన విజయాన్ని పురస్కరించుకుని, పవిత్రమైన కార్తీక మహా దీపం పండుగ లక్షలాది మంది భక్తులకు మహోన్నతమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. భారతదేశంలోని అతిపెద్ద భక్తి వేదిక అయిన శ్రీ మందిర్, శుక్రవారం, డిసెంబర్ 13, 2024న కార్తీక మహా దీపం లైవ్ దర్శన్ స్పెషల్‌లో పాల్గొనేందుకు భక్తుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమంను తీసుకువచ్చింది. పవిత్రమైన కార్తీక మహా దీపం తిథితో జరిగే ఈ పవిత్ర కార్యక్రమం అరుణాచల తీర్థ శివ పార్వతీ కళ్యాణం, మహా రుద్ర హోమంలను భక్తులు వర్చ్యువల్ గా దర్శించుకునేందుకు అనుమతిస్తుంది మరియు తమిళనాడులోని తిరువణ్ణామలై పవిత్ర పట్టణం నుండి అరుణాచలేశ్వర దీపం ప్రత్యక్ష దర్శనం సైతం వర్చ్యువల్ గా చేసే అవకాశం కల్పిస్తుంది.

దైవిక కాంతికి ప్రతీకగా నిలిచే పండుగ, కార్తీక మహా దీపం. దక్షిణ భారతదేశం అంతటా అసమానమైన ఉత్సాహంతో దీనిని వేడుక జరుపుకుంటారు. ఈ కార్యక్రమం అరుణాచలేశ్వర ఆలయంలో ముగుస్తుంది, ఇక్కడ పవిత్రమైన అరుణాచలం కొండపై మహా దీపం యొక్క గొప్ప కాంతి ప్రతి సంవత్సరం మిలియన్ల మంది భక్తులను ఆకర్షిస్తుంది. శివుని ప్రతిరూపమైన జ్యోతిర్లింగంగా (అగ్ని స్తంభం) గుర్తింపు పొందిన పవిత్ర క్షేత్రంలో జరిగే ఈ పండుగ, చీకటిపై కాంతి యొక్క విజయాన్ని ప్రతిబింబిస్తుంది మరియు అంతర్గత ప్రకాశానికి , కర్మ చక్రం నుండి విముక్తికి మార్గాన్ని అందిస్తుంది.

శ్రీ మందిర్ యొక్క కార్యక్రమం, సంప్రదాయం మరియు సాంకేతికత నడుమ వారధిగా నిలుస్తుంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో చేరడానికి వీలు కల్పిస్తుంది. ప్రత్యక్ష దర్శనం స్పెషల్‌లో ప్రతికూలతను పోగొట్టి, శ్రేయస్సును ఆకర్షిస్తుందని విశ్వసించే మహా రుద్ర హోమం మరియు శాంతి , జ్ఞానం కోసం దైవిక ఆశీర్వాదాలను కోరే పవిత్రమైన ఆచారమైన అరుణాచల తీర్థ శివ పార్వతీ కళ్యాణం ఉన్నాయి. దీనిలో పాల్గొనేవారు ధ్యానం చేయవచ్చు, మంత్రాలు పఠించవచ్చు లేదా పూజా క్రతువు ఆచారాలతో పాటు స్తోత్రాలను పఠించవచ్చు, శివునితో లోతైన సంబంధాన్ని పెంపొందించుకోవచ్చు.

“ అందరికీ అందుబాటులోకి వచ్చినప్పుడే ఆధ్యాత్మికత ఒక అర్థముంటుంది. కార్తీక మహా దీపం లైవ్ దర్శన్ స్పెషల్ భక్తులను ఎక్కడి నుండైనా ఈ పవిత్రమైన పండుగలో పాల్గొనటానికి, పవిత్ర అనుభవాలను పొందడానికి అనుమతిస్తుంది. విశ్వాసం మరియు సంబంధాన్ని వారి జీవితాలకు దగ్గరగా తీసుకువస్తుంది. ఆధ్యాత్మిక అనుభవాలు ఎక్కడ ఉన్నా అందరికీ అందుబాటులో ఉంచాలనే మా నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది” అని శ్రీ మందిర్ వ్యవస్థాపకుడు & సీఈవో ప్రశాంత్ సచన్ అన్నారు

కార్తీక మహా దీపం యొక్క పరివర్తన శక్తిని స్వీకరించడానికి మరియు తమ వేదిక ద్వారా అరుణాచలేశ్వర దీపం యొక్క దివ్య కాంతిని వీక్షించమని శ్రీ మందిర్ భక్తులను ఆహ్వానిస్తుంది. ప్రత్యక్ష దర్శనం శ్రీ మందిర్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటుంది, ఇది సౌకర్యవంతమైన మరియు లీనమయ్యే ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ఈ పవిత్రమైన వేడుకలో చేరండి మరియు శాంతి, శ్రేయస్సు మరియు విముక్తి వైపు మిమ్మల్ని శివుని యొక్క శాశ్వతమైన కాంతి నడిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest sport news. He had nо іntеrеѕt іn the еxіѕtіng rulеѕ оf thе gаmе. Will provide critical aid – mjm news.