లాపిస్ టెక్నాలజీస్ బిజినెస్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం

Launch of Lapis Technologies Business Innovation Centre

హైదరాబాద్: లాపిస్ టెక్నాలజీస్ తన బిజినెస్ ఇన్నోవేషన్ సెంటర్‌ను తార్‌బండ్ సమీపంలోని కార్పొరేట్ కార్యాలయంలో ప్రారంభించింది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సహకారంతో రూపొందించిన ఈ కేంద్రం.. ఎల్‌జీ విస్తృత శ్రేణి ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే ఉత్పత్తులు, సిస్టమ్ ఏసీలను అందించాల‌ని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రారంభోత్సవంలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, బి2బి ఐడి సొల్యూషన్స్ హెడ్ హేమేందు సిన్హా పాల్గొన్నారు. ఈ కేంద్రాన్ని సందర్శించేవారు ఇన్ఫర్మేషన్ డిస్ ప్లేలు, కమర్షియల్ ఎయిర్ కండిషనర్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రొడక్ట్ లతో సహా ఎల్‌జీ వారి విస్తృత శ్రేణి ఉత్పత్తులను చూడ‌గ‌లిగే అవకాశం ఉంటుంది. వ్యాపారాల‌తో పాటు క్ల‌యింట్లు ఇక్క‌డ ఉన్న ఎల్‌జీ వారి అత్యాధునిక ఉత్ప‌త్తుల‌ను రియ‌ల్ టైంలో అన్వేషించడానికి, పరీక్షించడానికి ఇక్క‌డున్న ఇంటరాక్టివ్ వాతావరణం వీలు క‌ల్పిస్తుంది.

ఎల్‌జీ వారి బీ2బీ ఉత్ప‌త్తుల‌తో కూడిన ఈ బిజినెస్ ఇన్నోవేష‌న్ సెంట‌ర్‌.. బీ2బీ రంగంలో తాజా ఆవిష్క‌ర‌ణ‌లు, సాంకేతిక పురోగ‌తిని ప్రోత్స‌హించ‌డంలో లాపిస్ టెక్నాల‌జీస్ అంకిత‌భావాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంది. ఇన్ఫర్మేషన్ డిస్ ప్లే కేటగిరీలో 163 ఆల్ ఇన్ వన్ ఎల్ ఈడీ స్క్రీన్, ఎల్ జీ క్రియేట్ బోర్డ్, 110 అంగుళాల స్మార్ట్ యూహెచ్ డీ లార్జ్ స్క్రీన్ డిస్ ప్లేల ఇన్ఫర్మేషన్ డిస్ ప్లే, హాస్పిటాలిటీ గ్రేడ్ 4కే టెలివిజన్లు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. బిజినెస్ సెంటర్ సిస్టమ్ ఏసీలూ ఉన్నాయి. ఈ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వాములు, కస్టమర్లు, సిస్టమ్ ఇంటిగ్రేటర్లకు ఎల్‌జీ వారి అత్యాధునిక ప‌రిక‌రాల‌ను ప్రత్యక్షంగా చూసేందుకు వన్-స్టాప్ గమ్యాన్ని అందిస్తుంది.

ఈ సందర్భంగా హేమేందు సిన్హా మాట్లాడుతూ.. “మా విజయానికి భాగస్వాములు కీలకమని మేము విశ్వసిస్తున్నాము. లాపిస్ ఇన్నోవేషన్ సెంటర్ కేవలం ఉత్పత్తులు మాత్రమే కాదు- ఇది సమగ్ర పరిష్కారాలను అందిస్తుంది. అవేంటో చూద్దాం.. సూపర్ సైన్ సీఎంఎస్‌ (కంటెంట్ మేనేజ్ మెంట్ సాఫ్ట్ వేర్): ఇది మా యాజమాన్య సాఫ్ట్ వేర్, ఇది వ్యాపారాలు త‌మ ఎల్‌జీ డిస్ ప్లేల అంతటా కంటెంట్ ను నిర్వహించడానికి, షెడ్యూల్ చేయడానికి అనుమతిస్తుంది. ఒకే పాయింట్ నుంచి అనేక‌ పరికరాలను నియంత్రించాల్సిన వ్యాపారాలకు ఇది అనువైనది, కంటెంట్ వివిధ ప్రదేశాలలో నిరాటంకంగా ఉపయోగించవ‌చ్చు.

ఎల్‌జీ కనెక్టెడ్ కేర్: ఇది మా రిమోట్ మానిటరింగ్ సొల్యూషన్. ఇది సంస్థ‌లు త‌మ ప‌రిక‌రాల‌ను రియల్ టైమ్ లో నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది క్లౌడ్ పై ఆధారపడి ఉంటుంది, క్రియాశీల పర్యవేక్షణను అందిస్తుంది. ఏ స‌మ‌స్య‌లైనా వ్యాపార కార్య‌క‌లాపాల‌ను ప్ర‌భావితం చేయ‌డానికి ముందే గుర్తించి, ప‌రిష్క‌రిస్తుంది.ఎల్‌జీ క్రియేట్ బోర్డ్ (ఇంటరాక్టివ్ సొల్యూషన్స్): విద్య, కార్పొరేట్ ప‌రిస్థితుల‌కు సహకారం మరింత సమగ్రంగా మారుతున్నందున, మా క్రియేట్ బోర్డ్ పరిష్కారాలతో వినియోగదారులు ఇంటరాక్టివ్ కంటెంట్ ను రూపొందించగ‌లరు. ఉత్పాదకతకు రియల్ టైమ్ ఇంటరాక్షన్ కీలకంగా ఉండే తరగతి గదులు, బోర్డ్ రూమ్ లు, సహకార ప్రదేశాలకు ఇది అనువైనది.

ఆల్ ఇన్ వన్ ఎల్ఈడీ డిస్‌ప్లే: 163 అంగుళాల ఆల్ ఇన్ వన్ ఎల్ఈడీ డిస్‌ప్లే. 1.8 ఎంఎం పిక్సెల్ పిచ్ తో ఉన్న ఈ స్క్రీన్ మాడ్యులర్ అయినా సింగిల్ లార్జ్ స్క్రీన్ లా పనిచేస్తుంది. స్పష్టత, అనుకూల‌త‌, అంతరాయం లేని ఇంటిగ్రేషన్ అవసరమైన బోర్డ్ రూమ్ లు, కాన్ఫరెన్స్ గదులు, ఆడిటోరియంలకు ఇది సరైనది. దీనిని ప్రజెంటేషన్లు, వీడియో కాన్ఫరెన్సింగ్ లేదా డిజిటల్ సైనేజ్ కోసం కూడా ఉపయోగించవచ్చు. కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకునేందుకు సేల్స్ టీమ్ వారితో సన్నిహితంగా పనిచేస్తుంది. అంచనాలు, డెలివరీ మధ్య గ్యాప్ లేదని ధృవీకరిస్తుంది. అమ్మకాల త‌ర్వాత కస్టమర్ల‌ సమస్యలను పరిష్కరించే ఒక ప్రత్యేక డైరెక్ట్ సర్వీస్ టీమ్ మాకు ఉంది. ఈ డైరెక్ట్ ఎంగేజ్ మెంట్ కస్టమర్లకు మద్దతు ఇస్తుందని, ఎల్‌జీ ఈ ప‌రిష్కారాల‌న్నింటినీ నిర్వ‌హించ‌డం క‌స్ట‌మ‌ర్ల‌కు భారీ ప్రయోజనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest sport news. But іѕ іt juѕt an асt ?. Illinois fedex driver killed after fiery crash on interstate.